కరోనా వైరస్ కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అనేక తిప్పలు పడుతున్నాడు. త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న తరుణంలో డోనాల్డ్ ట్రంపు అమెరికన్ల ను ఆకర్షించడానికి ఎన్నో కష్టాలు పడుతూ రాణిస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల టైంలో అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాన్ని ఆ దేశ ప్రజల్లో బాగానే తీసుకెళ్ళారు ట్రంప్. ఇక అక్కడి నుంచి మెక్సికో గోడ సహా కొన్ని కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకోవడం అప్పుడు సంచలనంగా మారింది.

 

అయితే ఈ ఏడాది నవంబర్ మాసంలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలకు డోనాల్డ్ ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేమిటంటే ఇమ్మిగ్రేషన్ ని తాత్కాలికంగా నిలిపి వేస్తూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. దాని మీద సంతకం కూడా చేసారు. ఇక అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుకోవడానికి గానూ మరో నిర్ణయం తీసుకున్నారు. హెచ్ 1 బీ వీసాల మీద తాత్కాలిక నిషేధం విధించే దిశగా అడుగులు వేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా అమెరికా దేశంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది.

 

అందులో విదేశీల కంటే అమెరికన్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు తీసేసిన అమెరికన్ల స్థానం లో తక్కువ ధరకు ఇతర దేశాల నుంచి వచ్చేవారిని తీసుకునే అవకాశం ఉండటంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా వరకు అతి తక్కువకే అమెరికాలో ఉద్యోగం చేసే వాళ్ళు భారతీయుల కావటంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇండియన్స్ కి బాగా దెబ్బ వేసినట్లయింది. దీంతో కొన్ని లక్షలమంది అమెరికాలో ఉన్న భారతీయులు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉండటంతో ప్రధాని మోడీ...ఈ విషయంపై డోనాల్డ్ ట్రంప్ తో మాట్లాడటానికి ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం.  

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: