కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసిందే.  చైనాలో  పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ కరోనా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ వ్యాపించి మనశ్శాంతి లేకుండా చేస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 40 లక్షలకు చేరువైంది. 2.70 లక్షల మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పుడీ మహమ్మారి బ్రెజిల్‌ను పట్టి పీడిస్తోంది. గత నాలుగు రోజుల్లో ఇక్కడ ఏకంగా 20 వేల కేసులు నమోదయ్యాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1.36 లక్షలకు పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన తొలి ఐదు దేశాల్లో అమెరికా, స్పెయిన్, ఇటలీ, బ్రిటన్, రష్యాలు ఉన్నాయి. బ్రిటన్‌లో తాజాగా మరో 626 మంది మరణించగా, వీరిలో ఆరు వారాల చిన్నారి కూడా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

 

 

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 95 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,981 చేరింది.   ఇప్పటివరకు మొత్తం 59,662కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 17,847 మంది కోలుకోగా, ఆసుపత్రుల్లో  39,834 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక దేశంలో ఎక్కువ కరోనా ఎఫెక్ట్ మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులో ఉంది. 

 

తాజాగా తమిళనాట ఈ కరోనా మహ్మారి  కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.  ఆదివారం ఒక్క‌రోజే కొత్త‌గా 669 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య ఏడు వేల మార్కును దాటి 7,204కు చేరింది. ఈ రోజు కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డ వారిలో 412 మంది పురుషులు, 257 మంది మ‌హిళ‌లు ఉన్నారు. ఇక ఆదివారం కొత్త‌గా మ‌రో ముగ్గురు క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డంతో మొత్తం మృతుల సంఖ్య 47కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: