ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య విమర్శలు కాస్త హద్దు దాటుతున్న విషయం తెలిసిందే. నిర్మాణాత్మక విమర్శలు కాస్త పోయి, వ్యక్తిగత దూషణల వైపు ఏపీ రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు కాస్త ఘాటుగానే విమర్శలు చేసుకుంటున్నారు. కాకపోతే వీరిలో కొందరు పరుష పదజాలంతో దూషించే వారు కూడా ఉన్నారు. అలా పరుష పదజాలంతో మాట్లాడే నేతల్లో మంత్రి కొడాలి నాని ముందుంటారని తెలుగు తమ్ముళ్లు గట్టిగానే చెబుతున్నారు.

 

అయితే ఈయనే ప్రధానంగా టీడీపీకి తలనొప్పి అవుతున్నారని తమ్ముళ్లు వాపోతున్నారు. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు అండ్ బ్యాచ్ ప్రతిరోజూ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. జగన్ ఏ కార్యక్రమం చేసిన, ఏ పథకం అమలు చేసిన కూడా చంద్రబాబుకు విమర్శలు చేయడమే పని. ఇక టీడీపీ నేతలు చేసే విమర్శలకు వైసీపీ నేతల నుంచి కూడా గట్టి కౌంటర్లే వస్తాయి. కాకపోతే వారి కౌంటర్లు టీడీపీ నేతలకు ఆనవు. మళ్ళీ వెంటనే తిరిగి టీడీపీ వాళ్ళు రివర్స్ లో కౌంటర్లు వేసేస్తారు.

 

అయితే కొడాలి నాని మాత్రం చేసే విమర్శలకు టీడీపీ నేతల దగ్గర నుంచి కౌంటర్లు రావడం వేరేగా ఉంటుంది. ఆయన కాస్త పరుష పదజాలం వాడటంతో టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇదే క్రమంలో టీడీపీ వాళ్ళ టార్గెట్ కూడా మారిపోతుంది. వారంతా కొడాలి మాటలపైనే చర్చ చేస్తారు. తాజాగా విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై టీడీపీ నేతలు, జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే, కొడాలి నాని సడన్ గా వచ్చి బాబు అండ్ బ్యాచ్ ని చెడామడా తిట్టేసారు.

 

దీంతో టీడీపీ నేతలు ఫోకస్ కొడాలిపై పెట్టి, ఆయన బూతుల మంత్రి అని, చంద్రబాబు అనడానికి సరిపోరని మాట్లాడుతున్నారు. అయితే ఇలా కొడాలి మీద ఫోకస్ పెట్టడం వల్ల అసలు మేటర్ పక్కకు వెళ్ళిపోతుందని, కాబట్టి కొడాలి మాటలు పట్టించుకోకుండా అసలు టాపిక్ మీద ఫోకస్ చేయాలని కొందరు తమ్ముళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ ఎంత చెప్పిన కొడాలి దెబ్బకు అసలు మేటర్ పక్కకు పోతున్నట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: