వ్యాపారం చేసుకుంటామని వచ్చి ఆ తర్వాత భారతీయులను బానిసలుగా మార్చుకొని...భారత  సంపదను దోచుకున్న బ్రిటిష్ వాళ్లని ఎదిరించి భారతమాతకు బానిస  సంకెల్లను  తెంచేయడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు జరిగిన ఈ మహోన్నతమైన పోరాటంలో భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో ఎంతో మంది ప్రాణాలను సైతం అర్పించారు. ఎంతోమంది మహావీరుల ప్రాణత్యాగం ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వతంత్ర భారతదేశం. అయితే భారత ప్రజలందరూ ఎప్పుడు స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఉంటారు. అయితే స్వతంత్ర సంగ్రామంలో ఎన్నో అధ్యాయాలు ఉన్న విషయం తెలిసిందే. 

 

 

 ఎన్నో ఏళ్ల పాటు స్వతంత్ర సంఘమం  కొనసాగింది. అయితే భారతదేశంలో భారతీయులను బానిసలుగా మార్చుకున్న బ్రిటిష్ విధానాలపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ తొలి తిరుగుబాటు జరిగింది మాత్రం మే 10వ తేదీన. 1957-58 లో ఉత్తర మధ్య భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా.. తిరుగుబాటు మొదలుపెట్టారు భారతీయులు . దీనినే మొదటి స్వతంత్ర సంగ్రామం అంటూ ఉంటారు. అయితే ఈ మొదటి తిరుగుబాటు వైఫల్యం చెందినప్పటికీ ఎంతో మంది దేశ ప్రజల్లో దేశం కోసం స్వాతంత్రాన్ని తీసుకు రావాలనే ఆకాంక్షను రగిల్చింది . అందరిలో బలమైన ఆలోచనకు పునాదిగా మారింది ఈ మొదటి తిరుగుబాటు . 1987 మే 10వ తేదీన మీరట్ లో మొదలైన సిపాయిల తిరుగుబాటు... భారత దేశంలో పౌర తిరుగుబాటు గా మారింది. 

 

 

 

 1858 జూన్ 20న తిరుగుబాటుదారులను ఆంగ్లేయులు ఓడించడంతో ఇది ముగిసిపోయింది. అయితే ఈ మొట్ట మొదటి తిరుగుబాటు ఆంగ్లేయుల అధికారాన్ని పెద్ద ఎత్తున సవాల్ చేసింది. అయితే ఈ తిరుగుబాటులో చాలామంది భారతీయులు పాల్గొనకుండా బ్రిటిష్ వారికి మద్దతు తెలిపారు. మొదటి సిపాయిల తిరుగుబాటు హింసాకాండకు నిలువుటద్దంగా  మారిపోయింది. బ్రిటిష్ వారు ఏకంగా గ్రామాలకు గ్రామాలనే తగలబెట్టడం తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారత బ్రిటిషు సామ్రాజ్య చరిత్రలో సిపాయి తిరుగుబాటు ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పను. అయితే ఈ తిరుగుబాటు కారణంగా 1958లో భారతీయులకు బ్రిటిష్ వలస రాజ్యాల పౌరులకు ఉండే హక్కును ఇస్తూ అప్పటి బ్రిటిష్ రాణి  విక్టోరియా భారతీయులకు హక్కులను ఇచ్చింది దీంతో స్వతంత్రం రాక పోయినా భారతీయులు మాత్రం కొన్ని హక్కులు సాధించారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: