దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో ప్రధాని మోడీ లాక్ డౌన్ ను పొడిగించేందుకు రెడీ అవుతున్నట్లు జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. మూడో దశ లాక్ డౌన్ ను పొడిగించే సమయంలో కొన్ని వాటికీ  మినహాయింపులు ఇవ్వటంతో ఒక్కసారిగా దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగి పోయాయి. దాదాపు 70 వేలకు దగ్గరలో ప్రస్తుతం ఉండటంతో మోడీకి ఆందోళన స్టార్ట్ అయ్యింది. వచ్చే వారం లోపు మూడో దశ లాక్ డౌన్ ముగిసే సమయానికి లక్ష పాజిటివ్ కేసులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా మినహాయింపులు ఇవ్వటంతో ప్రజలంతా ఒక్కసారిగా రోడ్లపైకి రావడం ఆరెంజ్ గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాల వద్ద సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా వ్యవహరించడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని అంటున్నారు.

 

కేంద్రం మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వలన ఆదాయాలు లేని రాష్ట్రాలు ఇష్టానుసారంగా మద్యం దుకాణాలు ఓపెన్ చేయటంతో పాటు సరైన జాగ్రత్త సోషల్ డిస్టెన్స్ మరియు మాస్కులు వంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వచ్చే వారానికి కేసులు ఎక్కువయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ ప్రతి రాష్ట్రం నుండి ఇంటిలిజెన్స్ నివేదిక తేప్పించుకుంటూ ఉంది.

 

ఏమాత్రం మద్యం దుకాణాల ద్వారా కరోనా వ్యాప్తి చెందిందని తేలితే వెంటనే మినహాయింపుల నుంచి వాటిని తీసివేస్తామని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇటువంటి సందర్భంలో త్వరలో లాక్ డౌన్ గురించి మోడీ పెట్టబోయే ప్రెస్ మీట్ లో.. ఇకనుండి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు సోషల్ డిస్టెన్స్ మరియు మాస్క్ విషయాలలో అశ్రద్ధ చూపుతుందో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు  మినహాయింపు లో కొన్ని కటింగులు పెట్టాలని మోడీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: