ప్రస్తుతం చాలా ఇంజనీరింగ్ కాలేజీలు  బురిడి ఇంజనీరింగ్ కాలేజీ లు  ఉంటున్న విషయం తెలిసిందే. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము కోసం మాత్రమే కాలేజీలను  స్తాపిస్తున్నాయి. అంతేకాకుండా ఒక లెక్చరర్ తో  ఏకంగా నాలుగు కాలేజీలలో పాఠాలు  చెప్పిస్తూ వారికి జీతాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. వీటన్నింటిపై ప్రభుత్వాలు కమిటీలు వేస్తూ పర్యవేక్షిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఉన్న చాలా ఇంజనీరింగ్ కాలేజీలలో  ఇలాంటివి జరుగుతున్నాయి. కేవలం ప్రభుత్వం చెల్లించిన ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము తో పాటు విద్యార్థుల నుంచి కూడా అదనపు చార్జీలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటూ చివరికి ఎలాంటి ప్రతిభ లేని  విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు. 

 

 అందుకే ప్రస్తుతం ఇంజనీరింగ్లో డిగ్రీ లో నేర్చుకోవాల్సింది కాస్త.. అమీర్పేట్ కోచింగ్ సెంటర్ లో నేర్చుకుంటున్నారు విద్యార్థులు. అయితే ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కొన్ని మల్టీనేషనల్ కంపెనీల తో టైయప్ అయ్యి ఉంటే... విద్యార్థులు తమ చదువు పూర్తి చేసేసరికి ఒక మంచి ఉద్యోగ అవకాశం దొరుకుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం తీరును కూడా తప్పుబడుతున్నారు ప్రస్తుతం విశ్లేషకులు. 

 

 

 అయితే అలాంటిది  మాత్రం ప్రస్తుతం ఉన్నత విద్యను బోధిస్తున్న కళాశాలలో జరగడం లేదు.ఎన్నో ఏళ్ల నుండి జరుగుతూ వస్తున్న ఈ తంతును  ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సరిదిద్దుతూ  వస్తున్నాయి. కేవలం తమ లెక్చరర్స్  కి 6నెల జీతాలు ఇచ్చి 12 నెలలు పని చేయించుకోవడం అంతే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ము తో పాటు అధిక ఫీజులు  వసూలు చేస్తున్న కాలేజీలపై ఒక జీవో జారీ చేసే కొన్ని కమిటీలు వేసి ఏ ఏ కాలేజీల కెపాసిటీ ఎంత ఉంది అనే దాన్ని గుర్తించాలి అంటూ ఆదేశాలు ఇచ్చారు. అయితే కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చెయ్యాలని అడగ్గా  ఆ జీవోను రద్దు చేసి ప్రస్తుతం... ప్రస్తుతం ఆయా కాలేజీలకు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం సరైనది కాదు అంటున్నారు విశ్లేషకులు. దీనికి  సంబంధించిన మరింత సమాచారం  క్రింది వీడియోలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: