కరోనా వైరస్ ప్రపంచాన్ని షేక్ చేసి పడేస్తోంది. ప్రతి ఒక్కరిలో భయాన్ని పుట్టించిన ఈ వైరస్ ప్రస్తుతం భూమి మీద 200 దేశాలకు పైగా విస్తరించి ఉంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ఫిబ్రవరి మాసం నుండి ఇతర దేశాలలో బయటపడింది. యూరప్ మరియు అమెరికా వంటి దేశాలలో విలయతాండవం చేసింది. ఈ వైరస్ వలన ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో మరణాలు సంభవించగా కొన్ని కోట్ల మంది శరీరాలలో ఈ వైరస్ దాగి ఉంది. అయితే ఈ వైరస్ ఇనుము మీద మరియు ప్లాస్టిక్ వస్తువుల మీద మూడు రోజులు బతికి ఉంటుందని, శరీరంపై కొన్ని గంటల పాటు ఉంటుందని, దుస్తులపై కూడా అదే విధంగా గంటల పాటు ఉంటుందని, ఇప్పటివరకు మనం వార్తలు విన్నాం.

 

అయితే తాజాగా కరోనా వైరస్ మన దైనందిన జీవితంలో భాగమైన స్మార్ట్ ఫోన్ పై దాదాపు 72 గంటలు ఉంటుందట. ఇదే విషయాన్ని పరిశోధకులు ఇటీవల కానుక్కోవడం జరిగింది. హ్యాండ్‌వాష్‌తో చేతులు కడుక్కున్నా, శానిటైజర్ అప్లై చేసినా వెంటనే స్మార్ట్‌ఫోన్ పట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నారు. స్మార్ట్ ఫోన్ నుండి కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ వైరస్ తీవ్రత ను కట్టడి చేయాలంటే చాలా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు.

 

ఎప్పటికప్పుడు ఫోన్ చాలా శుభ్రంగా ఉండాలని ఉంచుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఎంత శుభ్రంగా ఉంటే అంత కరోనా వైరస్ ని కట్టడి చేయడం చాలా సులువు అని అంటున్నారు. ప్రస్తుతం ఎలాంటి వస్తువులు పట్టుకున్న గాని దాన్ని శుభ్రం చేసి పట్టుకోవటం మంచిదని వైద్యులు మరి మరి చెబుతున్నారు. ఈ విషయాలన్నీ అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ యూనివర్సిటీ కి చెందినా పరిశోధకులు జరిపిన పరిశోధనలలో బయటపడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: