సినీ నటుడు కమల్ హాసన్ కు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు ఉంది. కమలహాసన్ విలక్షణ నటుడిగా ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కమలహాసన్ చేసే సంచలన వ్యాఖ్యలు మాత్రం ఆయనను ఎప్పుడూ విమర్శల పాలు  చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా స్వదేశమైన భారతదేశాన్ని కించపరుస్తూ విదేశాలను  పొగుడుతూ కమలహాసన్ చేసే వ్యాఖ్యలు... ఎన్నో  విమర్శలకు దారి తీస్తున్నాయి. అయినప్పటికీ ఎలాంటి విమర్శలు వచ్చినా కమల్  మాత్రం పట్టించుకోరు. 

 

 ఇక కమలహాసన్ తీరూపై  ఇప్పుడు విశ్లేషకులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏమీ తేడా ఉండదు అన్నట్లుగా...  నటుడు కమల్ హాసన్ పై ఎన్ని విమర్శలు చేసినా ఆయన తీరు మాత్రం మారదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భారత దేశాన్ని కించపరచడమే లక్ష్యంగా కమల్ హాసన్ వాక్యలు  చేస్తూన్నారు అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత గొప్ప వాగ్గేయకారుడైన త్యాగరాజు కృతుల గురించి కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు కమలహాసన్. 

 

 అయితే త్యాగరాజు  దేవుడి పేరు చెప్పి అడుక్కుతినేటువంటి వ్యక్తి అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక ఆన్లైన్ లో  పిటిషన్లు  కూడా కమల్ హాసన్ వ్యాఖ్యలపై వచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా పొరపాటు అయింది అని మాట్లాడకుండా... మతోన్మాదులు ఎవరో కావాలని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు  అంటున్నారు కమల్ . అయితే దీనిపై రాజకీయ విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వాగ్గేయకారుల గురించి మాట్లాడే ముందు వారి గురించి మాట్లాడే హక్కు కానీ స్థాయి గాని మనకు ఉందా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అని అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కింది వీడియోలో ఉన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: