కరోనా వైరస్ దెబ్బకి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతిపక్షాల నాయకులు ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అయితే ఏపీ లో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉండటం జరిగింది. కరోనా వైరస్ వచ్చిన నాటినుండి ఎక్కడా కూడా రాష్ట్రంలో పర్యటించిన దాఖలాలు లేవు.  హైదరాబాద్ లోనే ఉంటూ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై వాళ్ళు చేస్తున్న పని తీరుపై మండిపడటం ఆరోపణలు చేయడం మనం చూశాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కరోనా వైరస్ వచ్చిన సమయంలో రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి సమస్య ఉన్న పర్యటించిన సందర్భాలు లేదు. ఇటువంటి క్లిష్ట సమయంలో విశాఖపట్టణం గ్యాస్ లీకేజి ఘటన జరిగినపుడు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు బయటకు రావడంతో జనాలు నవ్వుతున్నారు.

 

ఇన్నాళ్ళు ఏమైపోయారు అన్ని సూటి ప్రశ్నలు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన అచ్చె నాయుడు, అయ్యన్నపాత్రుడు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ని టార్గెట్ చేయకుండా రాజకీయాలు ప్రదర్శించే విధంగా వ్యాఖ్యలు చేయడం పై జనాలు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నారు. మనుషులు చచ్చిపోతే గాని పొలిటికల్ మైలేజ్ ఉంటే గాని బయటకు రాలేరు, మీరు ప్రతిపక్ష పార్టీ నాయకులా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అచ్చం నాయుడు సొంత జిల్లాకు చెందిన ప్రజలు...అసలు కరోనా వైరస్ సమయంలో ఏమైపోయారు మీరు అని ప్రశ్నిస్తున్నారు.

 

ప్రజలు ఎలా ఉన్నారో కూడా వాకబు చేయలేదన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ టైములో టిడిపి నాయకులు బయటకు రావడాన్ని తప్పు పడుతున్నారట. కార్యకర్తలు గురించి కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రాజకీయాలు చేస్తూ ఇళ్ళలో ఉంటూ పార్టీని మేము మొయ్యాల అని మండిపడుతున్నారు అంట. మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ సమయములో సమస్యల విషయాల్లో ఎక్కడ కనబడని తెలుగు తమ్ముళ్లు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ఘటన తర్వాత మనుషులు చనిపోయిన తర్వాత బయటకు రావడం పై జనాలు సూటి ప్రశ్నలు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: