దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే వుంది. ఆదివారం దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దాంతో నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 4000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సమాచారం. సింగిల్ డే లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్. అందులో ఎక్కువగా  మహారాష్ట్ర లో 1278 కేసులు ,తమిళనాడు లో 669, ఢిల్లీ లో 381, గుజరాత్ లో 398, పశ్చిమ బెంగాల్ లో 153 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా  66000కేసులు నమోదు కాగా అందులో 2000కుపైగా మంది మరణించారు కాగా 20000మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం మూడో దశ లాక్ డౌన్ కొనసాగుతున్న కూడా పరిస్థితి ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. 
 
ఇక మరో వారం రోజుల్లో మూడో దశ దశ లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా పై అలాగే  లాక్ డౌన్ గురించి చర్చించనున్నారు. అయితే17తరువాత మరోసారి లాక్ డౌన్ ను పొడిగించేందుకు కేంద్రం సుముఖంగా లేదని తెలుస్తుంది. ఒకవేళ రాష్ట్రాల కోరిక మేరకు పొడిగించినా  కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగతా అన్ని జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు వున్నాయి.
 
లాక్ డౌన్ 3లో ఇప్పటికే  చాలా మినహాయింపులు ఇచ్చిన కేంద్రం ఆర్థిక వ్యవస్థ ను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తుంది. ఇక అన్ని రాష్ట్రాల్లో ఈనెల 17తో లాక్ డౌన్ ముగియనుండగా తెలంగాణ లో మాత్రం ఈనెల 29వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. రంజాన్ ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: