విశాఖ పరిసర ప్రాంతాల్లోని ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమ నుండి వెలువడిన గ్యాస్ చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు ఉన్న ప్రకృతిని నాశనం చేసిన విషయం తెలిసిందే. 12 మంది ప్రాణాలు వదలగా కొన్ని వందలమంది ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇకపోతే గ్యాస్ పీల్చిన వారు కాకుండా ప్రస్తుతానికి ప్రాణాలతో బయటపడిన వారిలో కూడా దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి అని వైద్యులు మరియు నిపుణులు నిక్కచ్చిగా చెబుతున్నారు. అలాగే ప్రాంతంలో పుట్టబోయే చాలామంది అంగవైకల్యం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయట.

 

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పరిశ్రమ చుట్టూ ఉన్న గ్రామస్తులంతా దానిని వారి ప్రాంతంనుండి తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అక్కడి పరిస్థితులను పరిశీలించిన నిపుణులు అక్కడ అంతా విషపూరితం అయిపోయింది అని తేల్చి చెప్పారు. త్రాగు నీరు, ఆహారం, భూమి, ఆకాశం లోని వాయువు అన్నీ కలుషితం అయినట్లు తెలిసిన వారు మరికొన్ని సంవత్సరాలు పరిస్థితి ఇలాగే కొనసాగితే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.

 

ఒక 5 కిలోమీటర్ల పరిధిలో పచ్చదనం అన్న పదమే లేదు. ఇప్పటివరకు పండించిన పంట అంతా నాశనం అయిపోయింది. బావుల్లో నీరు తాగడానికి కాదు కదా కనీసం వాడేందుకు కూడా పనికిరాకుండా పోయాయి. నీరు ఎండిపోవడం కనుక జరిగితే అది విషప్రభావం కొద్దిగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మనిషి శరీరంలో ఉన్న స్టైరీన్ పాలీమర్ గా మారి విషవాయువుని ఉత్పత్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: