విశాఖ నగరంలో గ్యాస్ లీకేజీ దుర్ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. ప్లాస్టిక్ తయారీ కంపెనీ అయిన ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుండి ప్రమాదవశాత్తు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఒక్కసారిగా విషవాయువు లీక్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఎక్కడికక్కడ కుప్పకూలిపోయారు... అచేతన స్థితిలో కి వెళ్లి పోవడం... చిన్నపిల్లలు నురగలు కక్కుతూ అపస్మారక స్థితికి వెళ్లడం ఆ దృశ్యాలు ఎంతో మందిని కలిచి వేసాయి.  ఈ ఘటనపై ఏకంగా దేశ ప్రధాని సైతం స్పందిస్తూ ఓ కమిటీని నియమించిన  విషయం తెలిసిందే.

 

 

 ఇక ఈ ఘటనను తీవ్రంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఎల్జీ  పాలిమర్స్ అనే కంపెనీ పై చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైంది. అయితే ఈ విష వాయువు కారణంగా ఏకంగా చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు చెందిన ప్రజలు అస్వస్థతకు గురై ప్రాణాలు సైతం కోల్పోయినవారు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ లీకేజీ బాధితులకు భారీ మొత్తంలో పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చింది. గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం అందిస్తామంటూ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం... ఈ విష వాయువు కారణంగా అనారోగ్యం బారిన  వారికి 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. 

 

 

 అయితే జగన్మోహన్ రెడ్డి  సత్వరంగా ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా ఇవ్వడం పై ప్రశంసల వర్షం కూడా కురుస్తున్న  విషయం తెలిసిందే. ఇక తాజాగా గ్యాస్ లీకేజీ బాధితులందరికీ ఈ పరిహారం సత్వరంగా అందేలా చర్యలు తీసుకుంటుంది ఏపీ సర్కార్. నేడు గ్యాస్ లీకేజీ దుర్ఘటన బాధితులకు నష్ట పరిహారం అందజేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితుల కుటుంబీకుల వద్దకు  మంత్రులు ఉన్నతాధికారులు వెళ్లి వెంటనే పరిహారం అందజేయాలని సూచించారు. ఈ పరిహారం కోసం ప్రజలు పదేపదే తిరగకుండా పారదర్శకంగా ఈ పరిహారాన్ని అందరు చేయాలంటూ తెలిపారు.  అంతే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆయా గ్రామాల్లో మంత్రులు బస చేయాలంటూ తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: