ఒకవైపు కరోనా వైరస్ ను చంపేందుకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీలో బిజీగా ఉండగా అన్నీ ప్రభుత్వాలు ఇప్పటికే తమ దేశాలలో సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించాయి. ఆయా దేశ వాసులను ఓపిక మరియు సహనంతో ఉండమని చెప్పి సామాజిక దూరం పాటించాల్సిందిగా కోరుతున్నారు. ఇకపోతే మధ్యలో ఎంతో మంది పరిశోధకులు ఎన్నో పరిశోధనల ద్వారా కోవిడ్-19 యొక్క లక్షణాలను వెల్లడిస్తూనే ఉన్నారు. వాటిల్లోనే కరోనా వైరస్ ఉపరితలంపై ఎంత కాలం బ్రతికి ఉంటుంది అన్న విషయం కూడా బయటపడింది.

 

ఇక విషయానికి వస్తే పరిశోధకులు కనుగొన్న తాజా వార్త ఇప్పుడు భారతదేశం గుండెల్లో గుబులు రేపుతోంది. వారు చెబుతున్నది ఏమిటంటే... వీర్యకణాలు అనగా మగవారి నుండి ఉత్పత్తి అయ్యే పునరుత్పత్తి పదార్థం (స్పెర్మ్) లో కూడా కరోనా ఉన్నట్లు కనుగొన్నారు. చైనా మరియు అమెరికా సైంటిస్టులు 38 మంది కరోనా వైరస్ కలిగిన పేషెంట్ల యొక్క వీర్యకణాల శాంపిల్స్ తీసుకొని పరీక్షించగా అందులో వైరస్ ఉన్నట్లు వారు గుర్తించారు. చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ముఖ్యమైన సమాచారం తో భారత్ రాబోయే రోజుల్లో విపరీతంగా నష్టపోనుందట.

 

ఒక సర్వే ప్రకారం లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి శిశువుల జననాల రేటులో ప్రపంచ దేశాల్లో అన్నిటికన్నా భారత్ ముందు ఉంది. అంతే కాకుండా సమయంలో గర్భం దాల్చిన వారి సంఖ్య కూడా మిగతా దేశాలతో పోలిస్తే భారత్ లో చాలా ఎక్కువ. ఇకపోతే టెస్టులు ఎక్కువగా జరగని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్లు తమ భార్యలతో శృంగారం లో పాల్గొంటే వారికి కూడా వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి.

 

ఇప్పటికే చాలా సడలింపులతో మద్యం షాపులు కూడా తెరిచారు కాబట్టి మగవారు కానీ వైన్ షాపుల వద్దకు వెళ్ళినా…. ఆడవారు కూరగాయలు కొనేందుకు బయటికి వెళ్ళినా ఇది చాలా త్వరగా వ్యాప్తి చెంది మరి కొద్ది నెలల్లోనే చైనా లోని కరోనా కేసుల సంఖ్య ను భారత్ దాటి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: