ఆస్పత్రుల్లో గర్భిణులకు ఒక ప్రత్యేక అవార్డు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందులోకి మామూలుగా అయితే ఎవరికీ అనుమతి ఉండదు. గర్భిణీ  వెంట ఒకరికి  మాత్రమే వెళ్ళడానికి వీలు ఉంటుంది. ఎంత పెద్ద హాస్పిటల్లో అయినా ఇలాంటి నిబంధనలు తప్పనిసరిగా ఉంటాయి.

 

 

ముఖ్యంగా గర్భిణీలు వార్డుకు మగవారిని అస్సలు అనుమతించరు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో కి ఓ  గర్భిణీ మహిళ భర్తను వైద్యుడు అనుమతించలేదు. ఎంత బతిమాలినా లోపలికి వెళ్లేందుకు ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఆ గర్భిణీ భర్త ఏకంగా ఆ వైద్యుడు చెవిని కొరికాడు . అక్కడున్న వారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా దాడికి దిగాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన  ఒక్కసారిగా ఆసుపత్రి లో కలకలం రేపింది. 

 

 

 వివరాల్లోకి వెళితే... ఒడిశాలోని బ్రహ్మ పురం నగరంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఒడిశాలోని గంజాం జిల్లా బ్రహ్మ పూర  మహారాజా కృష్ణ చంద్ర గజపతి వైద్య కళాశాల ఆస్పత్రిలో ఆదివారం  ఈ ఘటన  చోటు చేసుకుంది. గంజాం జిల్లా పురుషోత్తం పూర్ ప్రాంతానికి చెందిన తరుణీ ప్రసాద్ మహాపాత్ర్  తన భార్యను కాన్పు కోసం ఆసుపత్రిలో చేర్పించారు. కాగా  సదరు గర్భిణీ మహిళ వద్ద అప్పటికే ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే తాను కూడా తన భార్య ఉన్న ప్రసూతి వార్డులో కి వెళ్తాను అంటూ పట్టుబట్టాడు తరణి ప్రసాద్.  కానీ అందుకు వైద్యుడు స్మృతిరంజన్ నిరాకరించాడు.

 

 

ఇక ఎంతకీ లోపలికి పంపించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆగ్రహావేశాలకు లోనైన సదరు భర్త... వైద్యుడిపై దాడికి దిగాడు. ఇక అదే సమయంలో అక్కడే ఉన్న పీజీ వైద్య విద్యార్థి షకీల్  ఖాన్  మరో నలుగురు వైద్యులు అడ్డుకోగా... వైద్యుడి  ఎడమ చెవిని కొరకడంతో  తో పాటు మిగిలిన వారిపై కూడా దాడికి దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు... తరణి  ప్రసాద్ ను  అరెస్టు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: