మొన్నటి వరకు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ఎలా కంట్రోల్ చేయాలా అని నానా తంటాలు పడుతున్నారు. అయితే దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ కనుగొనలేదు.. దాంతో జాగ్రత్తలు తీసుకొని లాక్ డౌన్ పాటించాని నిర్ణయించారు.  ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎంతో కఠినంగా పాటిస్తూ రావడం వల్ల కరోనా కాస్త అదుపులోకి వచ్చిందని అంటున్నారు.  కానీ అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మాత్రం అస్సులు అదుపు కావడం లేదు. లాక్‌డౌన్ ను సడలిస్తున్న దేశాల్లో మహమ్మారి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. సడలింపుతో ఊపిరి పీల్చుకుని రోడ్ల మీదకు వస్తున్న జనం కారణంగా వైరస్ మళ్లీ వేగంగా వ్యాప్తి చెందుతోంది.  దక్షిణ కొరియాలో గత 24 గంటల్లో 34 మంది కరోనా బారినపడ్డారు. ఒకే రోజు ఇంతమంది వైరస్ బారినపడడం గత నెల రోజుల్లో ఇదే తొలిసారి.

 

కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వైరస్ తగ్గుముఖం పట్టింది.  మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా బార్లు, రెస్టారెంట్లు, దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడీ నిర్ణయమే వైరస్ తిరిగి విజృంభించేందుకు కారణమైంది. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో ఎక్కువ మంది ఇటువంటి కేంద్రాలను సందర్శించిన వారే కావడం గమనార్హం. జర్మనీలోనూ కొత్తగా 667 కేసులు నమోదయ్యాయి. ఓ జంతువధ శాలలో 180 మంది కరోనా బారినపడ్డారు. రష్యాలో పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతోంది. నిన్న ఒక్క రోజే అక్కడ 11,012 కేసులు నమోదయ్యాయి.

 

దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. పాకిస్థాన్‌లో నిన్న 2,870 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 30 వేలు దాటగా, 639 మంది మరణించారు.  దక్షిణాఫ్రికాలో 9,400 కేసులు నమోదు కాగా, ఆఫ్రికా ఖండంలో మొత్తం కేసుల సంఖ్య 60 వేలు దాటింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మన దేశంలో కూడా లాక్ డౌన్ సడలింపు చేస్తున్నారు. మద్యం షాపులు తెరచి ఉంచడం వల్ల లాక్ డౌన్ ఉల్లంఘన చేస్తూ గుంపులుగా వస్తున్నారని.. దీని వల్ల ఎంతో ప్రమాదం ఉందని అంటున్నారు మహిళా సంఘాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: