భారత దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు అమాంతం పెరిగి పోతున్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని రాష్ట్రాలలో పరిస్థితి ఊహించిన దానికంటే మరింత దారుణంగా మారిపోతుంది. రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం...  అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో అయితే రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతుంది. కరోనా  వైరస్ ఏకంగా తమిళనాడు రాష్ట్రంలో వందల్లో పెరిగిపోతూనే ఉంది. అయితే నిన్ను ఒక్క రోజు వ్యవధిలోనే తమిళనాడు రాష్ట్రంలో 669 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 509 కేసులు కేవలం చెన్నై నగరంలో నమోదు కావడం గమనార్హం. ఫలితంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా  వైరస్ బాధితుల సంఖ్య 7204 కు చేరింది. 

 

 

 కేవలం చెన్నైలోనే 3839 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాజిటివ్ కేసులను సగానికి పైగా కేసులు... కేవలం చెన్నైలోనే ఉండడం ప్రస్తుతం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. చెన్నై కాకుండా తమిళనాడులోని మిగతా అన్ని నగరాల్లో కేవలం 100 లోపే  కేసులు ఉండగా.... చెన్నైలో మాత్రం ఏకంగా 3835 కేసులు నమోదయ్యాయి.అయితే తమిళనాడులో కొత్త కేసులు ఎక్కువ మొత్తంలో నమోదు అవుతున్నప్పటికీ మరణాల రేటు మాత్రం తక్కువగానే ఉంది. ఇప్పటివరకు తమిళనాడులో మరణించిన వారి సంఖ్య నలభై ఏడు కు చేరుకుంది. 

 

 

 ముఖ్యంగా ఈ మహమ్మారి వైరస్ గర్భిణీల పై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. మధురై జిల్లాలో ఇప్పటి వరకూ నలుగురు గర్భిణీలు వైరస్ బారిన పడగా...  ఆదివారం గోరిపాలయం, ఉర్ మెచ్చిళ్ళం  ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరు గర్భిణీలు  కూడా ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డారు. అంతేకాకుండా ఒక్కరోజులోనే పదేళ్లలోపు చిన్నారిలు  కూడా ఈ మహమ్మారి వైరస్ భారిన  పడ్డవారు 20 మంది కావడం గమనార్హం. రోజురోజుకు తమిళనాడులోని చెన్నై ప్రాంతంలో మాత్రం పరిస్థితులు చేయిదాటిపోయేలా  కనిపిస్తున్నాయి అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: