ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మద్యం దుకాణాలను మూసి వేయాలని తెలుగుదేశం పార్టీ మహిళా నేత గద్దె అనురాధ విజయవాడ నగరంలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి అందరి ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడవేస్తుందని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని కుమార్తె శ్వేతా తో పాటు చాలా మంది టిడిపి పార్టీ మహిళా నేతలు గద్దె అనురాధ కు సంఘీభావం తెలుపుతూ నిరాహార దీక్షలో పాలు పంచుకున్నారు.


ప్రపంచం మొత్తం ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైన్ షాపుల తీయడం ఎంతో ప్రమాదకరమని... ప్రభుత్వ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని టిడిపి మహిళా నేతలు మండిపడ్డారు. మద్యం దుకాణాల ముందు బారులు తీరుతున్న మందుబాబులు సోషల్ డిస్టెంసింగు అసలు పాటించడంలేదని... దీని కారణంగా అనేకమందికి ఇబ్బందులు ఎదురవడం తో పాటు రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఘోరంగా పెరిగిపోతుందని గద్దె అనురాధ హెచ్చరించారు.


ఆమె ఓ ప్రముఖ న్యూస్ చానెల్ తో మాట్లాడుతూ... మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి... రాష్ట్ర ప్రభుత్వం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ ఎందుకు మద్యం షాపులు తెరవాల్సి వచ్చిందని మేమందరం ప్రశ్నిస్తున్నాం. ఆదాయ వనరులు పెంపొందించుకోవడానికి ఇది సమయం కాదు. ఆరోగ్యము చిన్నాభిన్నం చేసే గడ్డు పరిస్థితులను మనందరం ఎదుర్కొంటున్నాం. మద్యపాన దుకాణాల ముందు మందుబాబులు గ్యాపు మెయింటైన్ చేయకుండా దగ్గరగా నిల్చుడటం మనం చూస్తూనే ఉన్నాం. వీరందరూ కరోనా వ్యాప్తి చేయడానికి కారణం అవుతారు. అందుకే ఆ మద్యపాన దుకాణాలలో తక్షణమే మూసివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం' అని ఆమె అన్నారు.


కేశినేని నాని కుమార్తె కూడా మాట్లాడుతూ... చాలా మంది పేద ప్రజలు ఆర్థికంగా కుదేలై పోయి ఒక పూట తిండి కూడా లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కేవలం తమ స్వలాభం కోసం ఈరోజు నా ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరిచింది. ఈ రాష్ట్ర ప్రజల పట్ల మీకు ఏ మాత్రం బాధ్యత లేదా' అని ఆమె ప్రశ్నించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: