ఫెడరల్ స్ట్రక్చర్ అని ప్రస్తుతం మనం రోజు చెప్పుకుంటూ ఉంటారు. అయితే అటు కేంద్ర ప్రభుత్వానికి కేంద్రం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రం పరిధిలో అధికారాలు  ఉంటాయి. ఇక తమ తమ అధికారాలను సమర్ధవంతంగా నిర్వహించవలసి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ప్రస్తుతం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఏకంగా దేశానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా సమర్థవంతంగా ఉండకపోతే ఎలాంటి పరిస్థితులు దేశానికి ఎదురవుతాయి అన్నది ప్రస్తుతం ఇవాళ సజీవమైన సాక్ష్యం కళ్లెదుటే కనిపిస్తోంది. 

 


 ప్రస్తుతం రాజస్థాన్,  పశ్చిమబెంగాల్ ఢిల్లీలో ఏర్పడిన పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. గుజరాత్లో మహారాష్ట్రలో కూడా ప్రస్తుతం ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల అసమర్థత దేశానికి శాపం గా మారిపోయింది. ఏకంగా ఈ రాష్ట్రాల కారణంగా దేశంలో రోజురోజుకు కేసుల సంఖ్య  పెరిగిపోతున్నది . అయితే ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపు లో భాగంగా కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను ఆయా రాష్ట్రాలకు పంపించేందుకు సిద్ధం చేసింది. 

 


 అయితే శ్రామిక్ రైళ్లను మీ రాష్ట్రాలకు పంపిస్తున్నాము  వాటిని మీరు చూసుకోండి అని చెప్పడంతో దానిని వద్దు అంటున్నాయి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు . ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శ్రామిక్  రైళ్లను తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని చెబుతోంది. ఏకంగా  తమ రాష్ట్రానికి చెందిన ప్రజలు తమ రాష్ట్రానికి శ్రామిక రైళ్ల ద్వారా శ్రామికులను రానివ్వం  అంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే వలస కూలీల పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం అంటు ఎప్పుడు రాహుల్ గాంధీ చెబుతూ ఉంటారు. కానీ తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వలస కూలీల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది మాత్రం రాహుల్  గాంధీ ఎందుకు ప్రశ్నించ లేకపోతున్నారు అంటున్నారూ విశ్లేషకులు .దీంతో  మీ రాష్ట్రానికి చెందిన వారిని  రాష్ట్రాలకు పంపిస్తాం చూసుకోండి అంటూ  ఏకంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను  అడగాల్సి వస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: