లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణలో ఆర్టీసి బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ బస్సులు నడపాలా?వద్దా?అనే దానిపై ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది. ఈ నెల 15న జరిగే కేబినెట్ మీటింగ్‌లో ఇది తేలిపోనుంది. ఆ రోజునే సీఎం కేసీఆర్ దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా ఆర్టీసీ బస్సులు నడిపించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలోనే డిపోల్లో ఉన్న బస్సుల కండీషన్స్ పరిశీలిస్తున్నారు. 

 

నిజానికి...ప్రతీ బస్సును నాలుగు రోజులకోసారి చెక్ చేయాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ తర్వాత సడెన్‌గా నడిపిస్తే బస్సులో సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఏసీ బస్సులను ప్రతి రోజు గంట పాటు ఇంజిన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. ఎండ వేడికి సైతం ఇంజిన్లో ఇబ్బందులు వస్తుంటాయి. అయితే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ప్రతి బస్సును కండిషన్‌తోనే బయటకు పంపిస్తామని చెబుతున్నారు.

 

ఇక...బస్సులు డిపో నుంచి బయటకు వెళ్లే సమయంలో సోడియం హైపోక్లోరైడ్‌తో పూర్తిగా క్లీనింగ్ చేస్తారు. బస్సు చివరి గమ్య స్థానం చేరిన తర్వాతా క్లీనింగ్ చేస్తారు. ఇలా అన్ని డిపోలకు చెందిన అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లనున్నారు. ప్రతీ బస్సులో 50 శాతం కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లె వెలుగు...ఎక్స్‌ప్రెస్‌...సూపర్ లగ్జరీ...ఇంద్ర బస్సులను సగం సీట్ల కెపాసిటితోనే నడిపిస్తారు. సోషల్ డిస్టెన్స్ మొయింటెన్ చేస్తూ సీట్లకు నెంబర్స్ వేస్తున్నారు. నెంబర్ వేసిన సీట్లలోనే ప్రయాణీకులు కూర్చోవాల్సి ఉంటుంది. బస్సులో ఎక్కేవారు కచ్చితంగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. అయితే సగం సీట్లతోనే బస్సులను నడపిస్తే ఆర్టీసికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. టికెట్ ధరలను పెంచుతారా?లేదా?అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. బస్సులను నడిపించాలని ప్రభుత్వం డిసైడ్ అయితే టికెట్ ధరలపైనా క్లారిటి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి...వారం రోజుల్లో ఆర్టీసీ బస్సులు రోడ్లపైకి వచ్చే విషయంలో క్లారిటి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: