దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పరీక్షలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. కరోనా వైరస్ కట్టడి కావాలంటే కచ్చితంగా ఎక్కువ పరీక్షలు జరిగితేనే ఎక్కడికక్కడ కరోనా వైరస్ ను కట్టడి చేసిన వాళ్లమవుతాం అని వైద్యులు ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గాలను అందుబాటులోకి తీసుకు వస్తుంది. కరోనా పరీక్షల కోసం సరికొత్త విధానాలను అవలంబించే కార్యక్రమం చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యాంటీబాడీ టెస్టులో దేశీయంగా తయారైన యాంటీ బాడీ టెస్ట్ ని ఒక దానిని ప్రవేశ పెడుతుంది. “కొవిడ్ కవచ్ ఎలిసా”కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

మహారాష్ట్ర పుణెలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ఈ దేశీయ యాంటీబాడీ డిటెక్షన్ కిట్‌ను అభివృద్ధి చేసింది. ఈ కిట్‌ వల్ల దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది అనేది అంచనా వేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పై  నిఘా పెట్టేందుకు NIV తయారుచేసిన ఎలిసా (ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోసోర్బెంట్ ఎస్సే) టెస్టింగ్ కిట్ అనేది చక్కగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.

 

కేవలం నెల రోజుల్లోనే తయారుచేసిన ఈ కిట్స్ ద్వారా..దేశ వ్యాప్తంగా 90 శాంపిల్స్ ని 2.5 గంటల్లో టెస్ట్ చేసే అవకాశం 2.5 గంటల్లో పరీక్ష చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది పూర్తిస్థాయిలో కి అందుబాటులోకి వస్తే కరోనా వైరస్ కట్టడి చేయడంలో కీలక అడుగు వేసినట్లు అవుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రతి రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షల ఫలితాలు కేంద్రానికి అందేలా రాబోయే రోజుల్లో చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: