భూమి మీద ఉన్న మనిషి జీవితాన్ని కరోనా వైరస్ ప్రశ్నార్థకంగా మార్చింది. మెడిసిన్ లేని ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ప్రపంచంలో ఈ వైరస్ రోజురోజుకీ ఉధృతంగా మారుతున్న తరుణంలో కేసులు ఉన్న కొద్ది బయటపడుతూనే ఉన్నాయి. మరోపక్క త్వరలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తుందంటూ ప్రచారాలు ఎప్పటినుండో జరుగుతున్న పరిస్థితి మాత్రం వచ్చే విధంగా కనిపించడం లేదు. ఇప్పటికీ వ్యాఖ్యలు లేని వైరస్ లు భూమి మీద చాలానే ఉన్నాయి. అలాగే రాబోయే రోజుల్లో కరోనా కూడా వాటి పక్కన చేరనుంది అని అంతర్జాతీయ స్థాయిలో వైద్య నిపుణులు అంటున్నారు. ఈ భూమి మీద వాక్సీన్ లేని రోగాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా చూస్తే 1984లో హెచ్ఐవి వైరస్ బయటపడింది.

 

ప్రపంచం లో అనేక మంది ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు. చాలామంది హెచ్ఐవి వ్యాక్సిన్ వచ్చింది అంటున్నా ఇప్పటి వరకు బయటకు రాలేదు. హెచ్ఐవి రోగుల్లో ఎయిడ్స్ రోగులు వాక్సిన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా డెంగీ వైరస్‌, అతి ప్రమాదకరమైన రైనో వైరస్‌, అడెనో వైరస్‌లకు కూడా ఇప్పటివరకు వ్యాక్సిన్‌ లేదు.

 

వీటన్నింటికీ భిన్నమైనది ప్రపంచానికి అత్యంత ప్రమాదకారి కరోనా వైరస్‌. ఇప్పటికే వందకు పైగా ఫార్మా కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్‌ తయారుచేసే పనిలో ఉన్నాయి. చైనా నుండి మరియు అమెరికా నుండి కొన్ని సంస్థలు వాక్సిన్ రాబట్టే ప్రయత్నాలు  నిరంతరం పరిశోధనలు చేస్తున్న గాని లాభం లేకుండా పోయింది. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ కి వ్యాక్సిన్ భవిష్యత్తులో రాకపోతే మనిషి చేయాల్సింది ఇదే. 

 

* ముందుగా ప్రజలందరూ మానసికంగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది.

* కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే స్వచ్ఛందంగా చికిత్స చేయించుకునేందుకు ముందుకురావాలి.

* మనం పోరాడాల్సింది వ్యాదితో , రోగితో కాదు.. వారిని వెలివేసినట్లు చూడకుండా అభినందించేలా ఉండాలి.

* వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, మాస్కులను విధిగా ధరించడం చెయ్యాలి..

* సమాజిక దూరం తప్పనిసరిగా పాటించడం మరవద్దు..

* రానున్న రోజులు కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులే ఎక్కువగా కన్పిస్తున్నాయి.. దానికి గాను ప్రజలందరం మానసికంగా సిద్ధమవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: