విశాఖపట్టణం లో రిలీజ్ అయిన గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది చనిపోవడం తో చాలామంది ఈ ఘటనపై దిగ్భ్రాంతి చెందారు. కరోనా వైరస్ తో బాధపడుతున్న సమయంలో ఊహించని విధంగా తెల్లవారుజామున ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుండి స్టైరిన్ గ్యాస్ ఒక్కసారిగా లీక్ అవ్వటంతో కంపెనీ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఊపిరి తీసుకోవడానికి అనేక అవస్థలు పడ్డారు. అది నిద్ర పోతున్న సమయం కావటంతో చాలామంది నిద్రలోనే స్పృహ తప్పి పడిపోయారు. వందలాది మంది అనారోగ్యానికి గురికాగా 12మంది మరణించడం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించిన తీరు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

 

వెంటనే పొద్దున్నే సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి విశాఖపట్టణానికి హెలికాఫ్టర్ లో బయలుదేరి జగన్ బాధితులను పరామర్శించిన తీరు చూసి చాలా మంది బాధితులు జగన్ తమ కుటుంబ సభ్యుడిగా మమ్మల్ని బాగా ఆదుకున్నాడు ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఏ రాష్ట్రంలో చూడలేదు అని వ్యాఖ్యానించారు. వాస్తవంగా ఆయన రాకముందు వరకు అందరిలో భయంకరమైన కోపం ఉందని కానీ ఆయన ప్రవర్తించిన తీరు స్పందించిన విధానం చూసి పొరపాటున తప్పు జరగటం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగిందని గుర్తించి ఏమీ మాట్లాడలేక పోయాను అని బాధిత కుటుంబాలకు చెందిన కుటుంబ సభ్యులు కొంతమంది జగన్ తీరు పట్ల ఈ విధంగా స్పందించారు. వెంటనే అక్కడికక్కడ బాధితులకు కోటి రూపాయలు ప్రకటించడం విని ఆశ్చర్యపోయాం నోటి మాట రాలేదు మనిషికి మానవత్వం విలువ ఇచ్చే ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అన్నారు.

 

ప్రకటించిన రెండు రోజుల్లోనే 12 మంది కుటుంబ సభ్యులకు గాను ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఆంధ్ర ప్రదేశ్ మంత్రులు కోటి రూపాయల నష్టపరిహారాన్ని అందజేశారు. మరో నాలుగు కుటుంబాలకు త్వరలోనే పరిహారాన్ని అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా వార్డు గ్రామ వాలంటీర్ల ద్వారా గాయపడిన  ప్రతి వ్యక్తికి రూ.10వేలు అందిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభమైంది. ఘటన జరిగిన మూడురోజుల వ్యవధిలోనే రూ. కోటి పరిహారం బాధితులకు మంత్రులు  అందజేశారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తు చెక్కులను అందుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు జగన్ చెబితే చేసేవాడని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మాట మీద రాజకీయాల్లో నిలబడాలంటే వైస్ ఫామిలీ తర్వాతే మరెవరైనా అని వైస్సార్సీపీ కార్యకర్తలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: