ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. దీనితో వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలా మంది వారి సొంత ఊర్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో ఢిల్లీ సర్కార్ భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త తెలియజేయడం జరిగింది. ఒక్కొక్క వలస కార్మికులకు ఐదు వేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. 


ఈ నిర్ణయం కార్మిక శాఖ మంత్రి గోపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ బోర్డు సమావేశంలో అధికారులు తీసుకోవడం జరిగింది. ఇక ఇటీవల అందుకున్న సమాచారం మేరకు ఢిల్లీలో భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డులో 40000 మంది నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంక్షేమ బోర్డులో రిజిస్టర్ చేసుకున్న కార్మికుల అందరకు వారి బ్యాంక్ అకౌంట్లో రూ. 5000  జమ చేయాలని గడిచిన నెలలోనే ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఆ మొత్తాన్ని కూడా జమ చేసింది అని ఈ సందర్భంగా మంత్రి గోపాల్ రాయ్ తెలియజేయడం జరిగింది.

 
ఇక రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ నమోదు అవుతుండడంతో.. ఈ నెల కూడా లాక్ డౌన్ ఢిల్లీ ప్రభుత్వం పొడిగించడంతో కూడా కార్మికుల అందరకు మరో విడతగా ఐదు వేల రూపాయలు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలియజేశారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు అతి త్వరలోనే చేస్తున్నాము అని సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఇలా కార్మికులకు సహాయం అందిచడం ద్వారా చాలా మంది వలస కార్మికులు, సంక్షేమ బోర్డులో రిజిస్టర్ చేసుకున్న కార్మికులు కొంతవరకు సహాయం పొందగలుగుతున్నారు. ఢిల్లీలో కూడా కరోనా కేసులు చాలా అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: