లాక్ డౌన్ వల్ల ఏపీ ఆర్ధిక పరిస్థితి దారుణంగా దిగజారిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆర్ధిక పరిస్థితి ఎలా ఉన్నాసరే సీఎం జగన్...ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నారు. పథకాలు అమలులో ఎలాంటి ఇబ్బంది రానివ్వడం లేదు. కాకపోతే ఈ  ఆర్ధిక పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్ లో పథకాలు అమలు చేయడం ఇబ్బంది అవుతుంది.

 

అందుకే రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు రావడంతో ఆదాయం పెంచే మార్గాల్లో పడింది.  ఈ క్రమంలోనే ఇటీవల మద్యం రేట్లని విపరీతంగా పెంచింది. పవర్ చార్జీలు కూడా పెరిగాయి. ఇక తాజాగా సిమెంట్ రేట్లు కూడా పెంచారు. అయితే త్వరలో ఆర్టీసీ బస్ చార్జీలు కూడా పెంచుతారని తెలుస్తోంది. అయితే దీని వల్ల ప్రజలపై భారం పడుతుందని, జగన్ అధికారంలోకి రాకముందు ఒకలా మాట్లాడి, అధికారంలోకి వచ్చాక చార్జీల బాదుడే బాదుడు మొదలుపెట్టారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

 

అయితే రాష్ట్రం ఆదాయం పెరగాలంటే ఇలాంటివి తప్పవని  విశ్లేషుకులు అంటున్నారు. మద్యం ధరలు పెంచడం వల్ల మద్యం వినియోగం తగ్గుతుందని, జగన్ అనుకున్నట్లుగా దశల వారి మద్యపాన నిషేధంలో భాగంగానే ఆ రేట్లు పెంచారన్న సంగతి తెలిసిందే కదా అని గుర్తుచేస్తున్నారు.

 

ఇక కరెంట్ చార్జీల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, లాక్ డౌన్ వల్ల రెండు నెలలు కరెంట్ బిల్లుని ఒకేసారి తీయడం వల్ల ఎక్కువ వస్తున్నాయని, వాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందంటున్నారు. అలాగే కొందరు ఆన్ లైన్ లో బిల్లులు చెల్లించిన డబుల్ చార్జీలు వస్తున్నాయన్న విషయాన్ని కూడా పరిశీలించాలని కోరుతున్నారు.

 

ఇక పోతే ఇలాంటి టైంలో సిమెంట్ ధరలు పెంపు కూడా తప్పుపట్టలేమని చెబుతున్నారు. అలాగే రానున్న రోజుల్లో ఆర్టీసీ చార్జీలు పెరుగుదల కూడా తప్పదని, ఎందుకంటే బస్సుల్లో సామాజిక దూరం పాటించాలంటే ఎక్కువమందిని ఎక్కించుకోకూడదు కాబట్టి, రేట్లు పెంపు అనివార్యమని అంటున్నారు. పైగా అత్యవసరం ఉన్నవాళ్లే, బస్ ప్రయాణాలు చేస్తారని చెబుతున్నారు. కాకపోతే ఇవే అంశాలపై రాజకీయ లబ్ది పొందేందుకు టీడీపీకి మంచి అవకాశమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: