విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గ్యాస్ లీకేజ్ పాపం మీదంటే మీదని ఇరు పార్టీల నేతలు విమర్సలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు అసలు ఎల్జీ పాలిమర్స్  కంపెనీ గురించి వాస్తవాలు ఇవే అంటూ...కొన్ని పాయింట్లు చెప్పారు.

 

పాలిమర్స్ కంపెనీకి టీడీపీ ప్రభుత్వమే భూములిచ్చిందనడంలో నిజం లేదని, పాలిమర్స్‌కు 1964 నవంబర్ 23న అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం జీవో 2177 ద్వారా 213 ఎకరాల భూమిని కేటాయించిందని,  ఈ భూమికి 1992 అక్టోబర్ 8న ఆనాటి ప్రభుత్వం జీవో నెంబర్ 1033 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మినహాయింపులు ఇచ్చిందని తెలిపారు.

 

ఇక హైకోర్టు సూచనల మేరకే టీడీపీ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుందని, 2018 డిసెంబర్‌లో స్టైరీన్ ఉత్పత్తికి టీడీపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందనే ప్రచారంలో వాస్తవం లేదని,  వైసీపీ అధికారంలోకి వచ్చాకే  అనుమతులు వచ్చాయని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే బాబు ఇక్కడ వేరే ప్రభుత్వాల్లో జరిగిన విషయాలని స్పష్టంగా చెప్పి, తన హయాంలో జరిగిన ఘటనలని పైపైనే చెప్పే ప్రయత్నం చేశారు.

 

అసలు 2018 లో ఇదే సంస్థకు 400 టన్నుల ఉత్పత్తి నుంచి 600 టన్నుల ఉత్పత్తికి పెంచుకోవాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ఇంకా 1997 సెప్టెంబర్ లో ఈ సంస్థలో భారీ పేలుడు జరిగింది. గ్యాస్ సిలెండర్లు పేలి సుమారు 60 మంది వరకు మరణించారు.

 

ఇక బాబు ఈ విషయాలని చెప్పకుండా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఏ మాత్రం తాము తప్పు లేనట్లుగానే వేరే ప్రభుత్వం మీద తప్పు వచ్చేలా చెప్పారు. అసలు తాము హైకోర్టు డైరక్షన్ లొనే పని చేశామంటూ భలేగా చెప్పుకున్నారు. ఒకవేళ ఇదే కంపనీ వల్ల ఇలాంటి ఘటన ఏమి జరగకుండా మంచి ఆదాయం, పేరు వస్తే మాత్రం, ఆ ఘనత మాదే అంటూ టీడీపీ నేతలు డప్పుకొట్టుకునేవారు. ఏదేమైనా బాబు తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసారని మాత్రం అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: