కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్...పెద్దగా రాజకీయాలు జోలికి పోనని చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్లుగానే పెద్దగా రాజకీయాలు జోలికి వెళ్లడం లేదు గానీ ...అప్పుడప్పుడు వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే తాజాగా కూడా ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, టీడీపీ ప్రభుత్వం తరహాలోనే వైసీపీ ప్రభుత్వం కూడా.. ఇసుక అక్రమాలను కొనసాగిస్తోందని, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే కేసులు పెడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్సలు చేశారు.

 

అయితే ఇసుక తవ్వకాల్లో అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయో పవన్ సరిగాచెప్పలేదు. అలాగే అక్రమ తవ్వకాల్లో ఆధారాలు ఉన్న చూపించిన బాగానే ఉంటుంది. ఇక గతంలో టీడీపీ హయాంలో అక్రమాలు జరిగాయనే జనం జగన్ ని గెలిపించారు. ఇక ఇసుక తవ్వకాలపై ఇలా కామెంట్ చేసిన పవన్...వైజాగ్ గ్యాస్ లీకేజ్ పై తనదైన శైలిలో ప్రశ్నించారు.

 

ట్యాంక్ ఉష్ణోగ్రతలు లాక్‌డౌన్ సమయంలో ఎందుకు పర్యవేక్షించలేదని.. ప్రమాదం జరిగినప్పుడు సైరన్ ఎందుకు మోగలేదని.. యాజమాన్యం ప్రజలను ఎందుకు అప్రమత్తం చెయ్యలేదని, ట్యాంక్ పేలకుండా బ్రీథర్ వాల్వ్ తెరిచింది వాస్తవమేనా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు. ఇక  మొత్తం 24 ఆంశాలలో లోతైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాలన్నీ కొందరు రసాయనశాస్త్ర నిపుణులు తన దృష్టికి తెచ్చారని వివరించారు.

 

ఇక్కడ పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో, ఆ సంస్థని ప్రశ్నిస్తున్నారో అర్ధం కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే బాధితులకు సాయం అందించింది. ఇంకా రానున్న రోజుల్లో వారిని ఆదుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా ఈ ఘటనపై హై పవర్ కమిటీ వేసి, నిజనిజాలు తేల్చి, కంపెనీపై పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక కమిటీ రిపోర్ట్ వచ్చాకే పవన్ ప్రశ్నలకు క్లారిటీ వచ్చే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: