కరోనా వైరస్ ను కట్టడి చేసే విషయంలోనూ, లాక్ డౌన్ పొడిగింపు, ముగింపు విషయంలోనూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు తీసుకుని అమలు చేసే పనిలో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ఇబ్బందులను గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా అనేక అంశాల గురించి ప్రధాని మోదీ సీఎం లతో మాట్లాడుతూ ఇది ఐదవసారి కరోనా మహమ్మారి ని అడ్డుకట్ట వేయడానికి లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పటికీ ఇది కట్టడి కాకపోవడం తో ఈ వైరస్ ను కట్టడి లోకి వచ్చే వరకు రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు . 

 
 
ఈ సందర్భంగా మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా అనే ఛాలెంజ్ ఉందని, దానిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మీదే అంటూ  నరేంద్ర మోదీ అన్నారు. కరోనా కట్టడికి చాలా రాష్ట్రాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల పైన ప్రధానితో అభిప్రాయాలను పంచుకున్నారు. 
 
 
అయితే  బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ కేంద్రం తీరుపై మండిపడ్డారు. కరోనా పేరుతో కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోంది అంటూ ఆమె మండిపడ్డారు. అసలు రాష్ట్రాల్లో కేంద్రం పెత్తనం ఏంటి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: