విశాఖపట్టణం జిల్లాలో తిరుగులేని రాజకీయ నేతగా గంటా శ్రీనివాసరావు కి మంచి పేరు ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించిన గంటా శ్రీనివాసరావు 2014 ఎన్నికల సమయంలో టిడిపి పార్టీ తరఫున గెలిచి మంత్రి అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ కి దిమ్మ తిరిగిపోయే విధంగా కొన్ని సార్లు గంటా రాజకీయం చేశారు. అటువంటిది జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైసీపీ పార్టీలోకి వద్దామని చూసినా గాని జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. ఎప్పుడు అధికార పార్టీలో ఉండే అలవాటు ఉన్న గంటా శ్రీనివాసరావు టిడిపి పార్టీలో ప్రస్తుతం ఉంటున్న గని పెద్దగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పాల్గొనడం లేదు. అంతేకాకుండా ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో వచ్చిన కష్టానికి ఇప్పటికి కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు కనపడటంలేదు.

 

దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న విశాఖ ఉత్తరం లో కూడా టిడిపి పార్టీ కార్యకర్తలకు గంటా శ్రీనివాసరావు అందుబాటులో ఉండటం లేదని టిడిపి పార్టీలో టాక్. ఒకపక్క అధికార పార్టీ లోకి వెళ్ళ లేక మరో పక్క ప్రతిపక్షంలో కూడా ఉండలేకపోతున్నా గంటా శ్రీనివాస రావు కి నిలకడలేని తనం ఆయనని మరింత ఇబ్బందులు కు గురి చేస్తుందని ఏపీ రాజకీయాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా విశాఖ పట్టణంలో గ్యాస్ లీక్ ఘటన టిడిపి ప్రాతినిధ్యం వహిస్తున్న గణబాబు నియోజకవర్గంలో జరగటంతో టీడీపీ నేతలంతా రావడం జరిగింది.

 

చంద్రబాబు కూడా రావాలని ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీంతో లోకల్ టిడిపి నాయకులు వచ్చి బాధితులను పరామర్శించి వారికి అండగా నిలబడటం జరిగింది. శ్రీకాకుళం నుంచి అచ్చన్నాయుడు, తూర్పుగోదావ‌రి నుంచి చిన‌రాజ‌ప్ప, ప‌శ్చిమ గోదావ‌రి నుంచి రామానాయుడు వంటి వారు హుటాహుటిన వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. కానీ గంటా శ్రీనివాస‌రావు మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో మరోసారి గంటా శ్రీనివాసరావు పొలిటికల్ ఎపిసోడ్ పెద్ద హాట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: