చంద్రబాబు గురించి తెలుగుదేశం పార్టీలో గొప్పగా చెప్పుకుంటారు. మా నాయకుడు సాటి ఎవరూ లేరు. ఆయన అనుభవం దేశంలో కూడా ఎవరికీ లేదు అని చెబుతూంటారు.  ఇక చంద్రబాబు అయితే తాను సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని ప్రతీ రోజూ ఏదో ఒక సందర్భంలో చెప్పుకుంటూనే ఉంటారు. అటువంటి బాబుకు ఇపుడు జరిగిందేమిటి.

 

ఘోర అవమానం. నరేంద్రమోడీ బాబుని దారుణంగా అవమానించాడని తమ్ముళ్ళు రగిలిపోతున్నారుట. బాబు ఎంత మోడీని కీర్తిస్తున్నా కూడా మోడీ లైన్లోకి రావడంలేదు. అదే సమయంలో కనీసంగా కూడా మొర ఆలకించడంలేదు. తాజాగా విశాఖ వెళ్తానని బాబు మోడీని అనుమతి కోరారు. ప్రత్యేక విమానం ఇస్తే చాలు తాను హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖ వెళ్ళి అక్కడ గ్యాస్ లీకేజి బాధితులను పరామర్శించి వస్తానని కూడా బాబు వేడుకున్నారు.

 

ఈ మేరకు నేరుగా ప్రధాని ఆఫీస్ కే లేఖ రాశారు. కానీ ఇప్పటికి కూడా ప్రధాని ఆఫీస్ కనీసం కిమ్మనలేదు. ఇక గట్టి లాబీయింగ్ కూడా బాబు చేయించారని అంటున్నారు. అయినా సరే కేంద్ర పెద్దలు కరగలేదు. దాంతో బాబు అభిమానులు, టీడీపీ క్యాడర్ ఇపుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ కి ఇది అవమానమని కుమిలిపోతున్నారు.

 

నిజానికి బాబు కోరింది కూడా చిన్న కోరిక ఏమీ కాదు, ప్రధానులు, హోం మంత్రుల స్థాయి వారే ఎక్కడికీ వెళ్లలేక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవాలు జరిపించేస్తున్నారు. అంతే కాదు, ప్రత్యేక విమానాలు కూడా ఇపుడు కేవలం కరోనా కేసుల విషయంలో వాడుతున్నారు. దేనికీ ఉపయోగించడంలేదు. అలాంటిది బాబు కోరిన కోరిక చాలా పెద్దది. అందువల్లనే ఆయన్ని కేంద్రం పట్టించుకోలేదని వినిపిస్తోంది.

 

ఏది ఏమైనా కూడా బాబు చరిష్మా పొలిటికల్ గా తగ్గుతోందా లేక ఆయనకు చెడ్డ రోజులు నడుస్తున్నాయో అర్ధం కావడంలేదుట తమ్ముళ్లకు, అయినా మంచి రోజుల కోసం వేచి చూడక తప్పదుగా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: