మొన్నటి వరకు కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు అనిపించిన కేరళలో నిన్నటి నుండి స్వల్పంగా కేసులు పెరిగాయి. ఇటీవల ఆ రాష్ట్రానికి  విదేశాల నుండి  వచ్చిన  వారే వల్లే ఈ కేసులు పెరుగుతుండడంతో కేరళ కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. నిన్న కొత్తగా 7కేసులు నమోదు కాగా ఈరోజుమరో 7కేసులు నమోదయ్యాయి. వీటిలో 10 కేసులు విదేశాల నుండి  వచ్చినవే కాగా మిగితావి కాంటాక్ట్ కేసులు. ఇక ఈరోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 519 కేసులు నమోదయ్యాయి.అందులో 489 మంది కోలుకోగా ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 27కేసులుయాక్టీవ్ గా వున్నాయి. 
ఇక మిగతా రాస్ట్రాల విషయానికి వస్తే గత రెండురోజుల నుండి కర్ణాటక లో కేసులు పెరుగగా ఈరోజు మాత్రం భారీగా తగ్గాయి. ఈరోజు కొత్తగా అక్కడ 15కేసులు మాత్రమే నమోదయ్యాయి అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈరోజు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆరాష్ట్రంలో కొత్తగా 38కేసులు నమోదయ్యాయి.అయితే తమిళనాడు , తెలంగాణ లో మాత్రం ఈరోజు భారీగా కేసులు పెరిగాయి. తమిళనాడు లో మరో 798 కేసులు నమోదు కాగా  తెలంగాణ లో ఈరోజు కొత్తగా 79 కేసులు నమోదయ్యాయి. ఈ 79కేసులు కూడా  జీహెచ్ఎంసీ పరిధిలోనివే.

మరింత సమాచారం తెలుసుకోండి: