కరోనా కేసుల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో అంతా రివర్స్ జరుగుతుంది. ఓ రాష్ట్రంలో కేసులు తగ్గితే మరో రాష్ట్రంలో  కేసులు పెరుగుతున్నాయి. మొదటి దశ లాక్ డౌన్ లో ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఆతరువాత ఎప్పుడైతే మర్కజ్ ప్రార్ధనల సంఘటన బయటపడిందో అప్పటి నుండి ఆంధ్రా, తెలంగాణ ను దాటేసింది. రెండో దేశ లాక్ డౌన్ లోను దాదాపు ఆంధ్రాలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి అయితే తెలంగాణ అసలు టెస్టులు చేయడం లేదని అందుకే కేసులు లేవని కూడా  ప్రచారం జరిగింది. ఇక మూడో దశ ముగింపులో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. గత మూడు రోజుల నుండి ఆంధ్రాలో కేసులు తగ్గుతుండగా తెలంగాణ లో మాత్రం  కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అందులో భాగంగా నిన్న ఆంధ్రా లో 38 కేసులు నమోదు కాగా  తెలంగాణ లో మాత్రం ఏకంగా 79 కేసులు నమోదయ్యాయి. అయితే ఇక్కడ సంతోషించ దగ్గ విషయమేంటంటే ఈ కేసులన్నీహైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి దాంతో మిగితా జిల్లాలు గ్రీన్ జోన్ లోకి మారనున్నాయి. 
 
 
ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు మొత్తం 2018కేసులు నమోదు కాగా అందులో 975కోలుకొని 45మంది మరణించారు. ప్రస్తుతం 998కేసులు యాక్టీవ్ గా వున్నాయి. తెలంగాణ లో మొత్తం కేసుల సంఖ్య 1275కు చేరగా అందులో 801బాధితులు కోలుకోగా 30 మంది మరణించారు. ప్రస్తుతం 444 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇదిలావుంటే ఓవరాల్ గా ఇండియాలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 70766కు చేరగా అందులో 2294 మంది మరణించారు. ప్రస్తుతం 45919 కేసులు యాక్టీవ్ గా ఉండగా 22549 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే దేశ వ్యాప్తంగా  3589కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: