రాను రాను లోకంలో పవిత్రమైన జీవనానికి అర్ధం మారి పోతుంది.. నేటి సమాజంలో అమ్మాయిలను గానీ, అబ్బాయిలను గానీ ఆర్డర్ ‌వేసి కంట్రోల్ చేసే పరిస్దితులు లేవు.. ఎవరికి నచ్చినట్లుగా వారు జీవించడం అలవాటు చేసుకుంటున్నారు.. అది మంచి అయినా చెడు అయినా వారి విషయంలో ఇతరులు జోక్యం చేసుకుంటే సహించడం లేదు.. సరే కానీ ఈ స్వేచ్చ అనేది ఇతరులకు ఇబ్బంది కలుగకుండా ఉన్నంత వరకు ఓకే మరీ అసహ్యంగా మారితే.. చూడటం, భరించడం చాలా కష్టం.. దేశం ఏదైనా అక్కడ జీవించే ప్రజలకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి.. ఇవేవి పట్టించుకోని వారు కొందరు బహిరంగంగానే శృంగారంలో పాల్గొంటున్న సంఘటనలు కొన్ని వెలుగులోకి వచ్చాయి..

 

 

వారికి సిగ్గు ఉండకపోవచ్చూ కానీ చూసేవారికి మాత్రం ఎంతో ఇబ్బంది కలుగుతుంది.. ఇలాంటి ఘటనే మరోటి జరిగింది.. అదేమంటే తాజాగా చైనాలో ఓ యువతి ఐకియా స్టోర్ లోని పరుపులు, సోఫాలపై పడుకుని హస్తప్రయోగం చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందట.. ఇక ఈ యువతి చేసిన పనికి నెటిజన్లు ఊరుకుంటారా.. ఐకియా స్టోర్ యాజమాన్యంపై దుమ్మెత్తి పోస్తున్నారట. అంతే కాకుండా ఇదా మీ స్టోర్ లో ఉండే సెక్యూరిటీ, స్టోర్ లలో ఇలాంటి పనులు జరుగుతుంటే వస్తువులు ఎలా కొనేది అని ప్రశ్నిస్తున్నారట. దీంతో ఐకియా యాజమాన్యం వెంటనే స్పందించింది.

 

 

త‌మ సెక్యూరిటీని మ‌రింత పెంచుతామని హామి ఇచ్చిందట.. ఇకపోతే ఈ సంఘటన బీజింగ్ లోని, గ్వాంగ్‌డాంగ్ ప‌రిధిలో ఉన్న ఐకియా స్టోర్ లో  జ‌రిగిన‌ట్లు నెటిజ‌న్లు పేర్కొంటున్నారు.. కాగా ఈ స్టోర్‌లో ఏ ఒక్కరు కూడా మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి ఇది జ‌న‌వ‌రిలో జ‌రిగి ఉండ‌వ‌చ్చని అభిప్రాయ ‌ప‌డుతున్నారు.. ఇక స్టోర్ యజమాన్యం ఈ సంఘట‌న‌పై పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చామ‌ని పేర్కొంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: