ఏపీ సీఎం జ‌గ‌న్ , తెలంగాణ కేసీఆర్ మ‌ధ్య గ‌త మూడు నాలుగేళ్లుగా మంచి స‌ఖ్య‌త వాతావ‌ర‌ణం ఉంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అప్ప‌ట్లో ఏపీ సీఎంగా ఉన్న చంద్ర‌బాబు తో ఉన్న వైరం నేప‌థ్యంలో కేసీఆర్‌. జ‌గ‌న్ మ‌ధ్య మంచి దోస్తానా ఏర్ప‌డింది. దీనికి తోడు చంద్ర‌బాబు తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేయ‌డం... కేసీఆర్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం.. అదే టైంలో వైసీపీ ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా టీఆర్ఎస్ కు ప‌రోక్షంగా స‌పోర్ట్ చేయ‌డంతో జ‌గ‌న్‌, కేసీఆర్ మ‌ధ్య మామూలు వాతావ‌ర‌ణం లేదు. వీరిద్ద‌రు ఓ పెవికాల్‌.. పెవికిక్ మాదిరిగా అతుక్కు పోయారు. ఇక ఏపీలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ టీం అంతా ప్ర‌త్య‌క్షంగాను లేదా ప‌రోక్షంగానో వైసీపీకి స‌పోర్ట్ చేసింది.

 

కొంద‌రు తెలంగాణ మంత్రులు అయితే చంద్ర‌బాబును చిత్తుగా ఓడించి జ‌గ‌న్‌ను సీఎం చేయాల‌ని కూడా పిలుపు ఇచ్చారు. అయితే గ‌త కొద్ది రోజులుగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల సీఎం మ‌ధ్య పంచాయితీలు మొద‌ల వుతున్నాయి. ముఖ్యంగా నీటి విష‌యంలో రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చాలా పంచాయ‌తీలు న‌డుస్తున్నాయి. వీటి వ‌ల్లే ఎప్ప‌ట‌కి అయినా రెండు రాష్ట్రాల మ‌ధ్య వార్ త‌ప్ప‌ద‌న్న సందేహాలు ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు కృష్ణా న‌ది నీళ్లు ఈ ఇద్ద‌రు సీఎంల మ‌ధ్య స‌రి కొత్త పంచాయ‌తీకి తెర‌లేపి న‌ట్టు క‌న‌ప‌డుతోంది. 

 

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని సీఎం శ్రీ కేసీఆర్ అన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విభజన చట్టానికి విరుద్ధమని సీఎం అన్నారు. ఈ సందేశం తెలంగాణ సీఎంవో అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా లో య‌ధావిధి గా పో స్ట్ చేసుకున్నారు. దీనిని బ‌ట్టి చూస్తుంటే జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని కేసీఆర్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్టే ఉంది. మరి కొత్త పంచాయితీ ఎటు వైపున‌కు వెళుతుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: