ఏపీ లో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో కరోనా నిర్థారణ టెస్టులు చేపడుతుంటే…. అదే ఊపులో కేసులు కూడా భారీ స్థాయిలో బయటపడుతున్నాయి.  ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు 7,409 నమూనాలను పరీక్షించగా.. 38 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,018కి చేరింది.

 

గడిచిన 24 గంటల్లో ఒక్క మరణం కూడా చోటు చేసుకోలేదు. కావున మరణాల సంఖ్య 45 గానే ఉంది. గత వారం రోజులుగా 60కుపైగా కేసులు నమోదుకాగా.. ప్రస్తుతం పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. గత రెండు రోజులుగా కేసుల సంఖ్య తక్కువ కావడం సానుకూలంశం. గత 24 గంటల్లో 73 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 998గా నమోదయ్యింది. మిగిలిన 975 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరు జిల్లాలో 9, కర్నూలులో 9, అనంతపురంలో 8, గుంటూరులో 5, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో మూడు చొప్పున, నెల్లూరులో 1 కేసు ఉన్నాయి. మొత్తంగా అనంతపురంలో 115, చిత్తూరులో 121, కర్నూలులో 575, గుంటూరులో 387, కృష్ణా జిల్లాలో 342, నెల్లూరు 102, కడపలో 97, పశ్చిమగోదావరిలో 68, విశాఖపట్నంలో 66, ప్రకాశం 63, తూర్పుగోదావరిలో 46 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: