కరోనా వైరస్ ప్రతి వారి జీవితాన్ని కాలరాసిందని చెప్పవచ్చూ.. అత్యంత శక్తి వంతమైన టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్న ఈ సమయంలో ప్రపంచాన్ని కోలుకోలేని విధంగా ఈ వైరస్ దెబ్బతీసింది.. ముఖ్యంగా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆలోచించే వారి విషయంలో ఈ కరోనా చీకటి దొంగలా మారింది.. అదీగాక పిల్లల చదువులు ఇప్పుడు కళ్లముందున్న పెద్ద సమస్య.. ఇప్పటికే తెలంగాణాలో టీఎస్ ఆర్టీసి వారు చేసిన పనివల్ల నెలరోజులు స్కూళ్లకు సెలవులు లభించాయి.. ఆ తర్వాత అలా స్కూళ్లకు వెళ్ళారో లేదో ఈ లోపల మాయదారి కరోనా వచ్చిపడింది.. అప్పటి నుండి స్కూళ్లు బంద్.. ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్ అంటూ లేని ఈ దశలో ప్రజలందరు కరోనాతో జీవించడం నేర్చుకోవాలని ప్రభుత్వాలు సందేశాలు ఇస్తున్నాయి..

 

 

దీంతో జీవించాలంటే ఇది చెప్పినట్టు వినే కట్టుకున్న పెళ్ళాం కాదు.. మన చుట్టం కాదు.. అదీగాక రానున్నది వర్షాకాలం.. ఆ పై చలికాలం.. ఈ సమయంలో ప్రజలాందరు సోషల్ డిస్టెన్స్ పాటించండని చెబుతున్నారు.. అసలు కరోనా వ్యాపిస్తున్న సమయంలో లాక్‌డౌన్ ప్రకటిస్తేనే ఎవరు మాట వినలేదు.. ఇక లాక్‌డౌన్ ఎత్తేసాక బుద్దిగా ఉంటారని ఆలోచించడం అవివేకం.. ఈ సమయంలో స్కూళ్లు, కాలేజీలు కనుక ఒపెన్ అయితే.. పరిస్దితులు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తాయో చెప్పడం కష్టం.. అసలే ఈ కరోనా నల్లిలా దాక్కుని మనుషులకు అంటుకుంటుంది.. ఈ సమయంలో బడికి పంపే పిల్లలను ఎంత జాగ్రత్తగా కాపాడిన గాని కరోనా బూచోడి నుండి కాపాడటం కష్టం అనే వాదన వినిపిస్తుంది..

 

 

స్కూళ్ళకు వచ్చే వారిలో గానీ, వారి ఇంటిలో గానీ, లేదా పాఠాలు చెప్పే పంతుళ్లల్లో గాని పొరపాటున ఈ వైరస్ దాక్కొని ఉందంటే జరగబోయే దారుణాలు తెలిసిందే. ఇక ఈ సమయంలో పిల్లల చదువులు ఆపడమా. వారి ప్రాణాలు ప్రమాదంలో పడవేయడమా అనే ప్రశ్న ప్రతి తల్లిదండ్రులను అయోమయంలో పడవేస్తుంది.. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్దితుల్లో చావుతో సావాసం చేయడం తప్పేలా లేదు.. కానీ స్కూళ్లకు పంపి పిల్లలను కూడా కరోనా కోరలకు అప్పగించడానికి మనసు ఒప్పడం లేదు.. మరెలా అంటే ఇలాంటి విషయంలో ముంబై వాసులు మాత్రం పాఠశాలలను తెరిచినా తమ పిల్లల్ని పంపేది లేదని తేల్చి చెబుతున్నారట..

 

 

అంతే కాకుండా ఆరు నెలల వరకు తమ పిల్లల్ని బయటకు పంపేందుకు, స్నేహితులను కలిసేందుకు, సినిమాలకు, మాల్స్‌కు అనుమతించబోమని, పాఠశాలల్లో తమ పిల్లల భద్రతకు పూర్తి హామీ లభించిన తర్వాత మాత్రమే పిల్లల్ని స్కూలుకు పంపుతామని పేర్కొంటున్నారట.. అంతే కదా పిల్లల విషయంలో నిర్ణయం ఏదైనా తల్లిదండ్రుల చేతుల్లోనే ఉండేది.. మరి ఈ గండం నుండి ఎందరు గట్టెక్కుతారో... 

మరింత సమాచారం తెలుసుకోండి: