రాబోయే కాలంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రపంచ దేశాలను  ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చ‌రించింది. చాలారోజులుగా అనేక దేశాల్లో లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న నేప‌థ్యంలో ప‌లు ద‌శ‌ల్లో స‌డ‌లింపులు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిట‌న్‌, భార‌త్‌, పాకిస్థాన్‌, స్పెయిన్ వంటి దేశాలు క్ర‌మంగా లాక్‌డౌన్‌ను స‌డ‌లిస్తున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసే విష‌యాల్లో ఎంతో జాగుర‌క‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌తినిధులు సూచిస్తున్నారు. ప్ర‌పంచ మాన‌వాళికి క‌రోనా పెద్ద గండంగా మారింద‌ని వారు అభివ‌ర్ణించారు.

 

ఈ మహమ్మారి విజృంభణను అడ్డుకోవ‌డానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా ఆంక్షల్ని సడలించిన పలు దేశాల్లో వైరస్‌ వ్యాప్తి పెరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి. జర్మనీ, ర‌ష్యా, భార‌త్ వంటి దేశాల్లో నిబంధనల్ని సడలించిన తర్వాత వైరస్‌ వ్యాప్తి వేగవంతమైనట్లు గుర్తించిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌తినిధులు పేర్కొన్నారు. మరోవైపు కరోనాను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచదేశాల ప్రశంసలందుకున్న దక్షిణ కొరియాలో ఆంక్షల సరళతరం చేసిన తర్వాత నైట్‌ క్లబ్‌లు మహమ్మారి వ్యాప్తికి కేంద్రాలుగా మార‌డం ఇప్పుడు ఆ దేశంలో గుబులు రేపుతోంది.


రాబోయే కొన్ని రోజులు ప్రజలు లాక్‌ డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించి, ఇళ్ల కే పరిమితం కావాలని కోరారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చినా, కరోనా సోకకుండా మాస్కులను తప్పనిసరిగా ధరించాలని, ఎక్కడికి వెళ్లినా భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. రాబోయే కొన్ని రోజులు అప్రమత్తంగా లేకపోతే ఇంతకాలం పడిన శ్రమంతా వఅధా అవుతుందని గుర్తించాలని ప్రజలకు హితవు పలికారు. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటుగా లాక్‌ డోన్‌ నిబంధనలను పాటించేలా చూడాలని, శానిటైజర్లను ఏ విధంగా ఉపయోగించాలన్న విషయంగా ప్రజలకు అవగాహన కలిగించాలని ఆయా దేశాల‌కు డ‌బ్ల్యూహెచ్‌వో ప్ర‌తినిధులు పిలుపునిచ్చారు.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: