ఇటీవల ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మే 17 తర్వాత కూడా లాక్ డౌన్ ను పొడిగించడం జరిగింది. గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో రెడ్ జోన్లలో కూడా అనుమతి ఇచ్చారు. ఒక విద్యాలయాలు, ప్రార్థనాలయాలు, సినిమా హాల్స్, హోటళ్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఇది తెరుచుకోవడానికి కనీసం నెల రోజులకు పైగానే సమయం పట్టే అవకాశం ఉందని మేధావులు అంటున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ హోటళ్ళు మరియు సినిమా హాల్ లో ఉన్న చోట ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో కేంద్రం అనుమతి ఇవ్వనున్నట్టు అర్థమవుతుంది.

 

ఇలాంటి చోట్ల సోషల్ డిస్టెన్స్ చెయ్యాలంటే కొంచెం కష్టమయ్యే అవకాశం ఉండటంతో హోటళ్ళు మరియు సినిమా హాలు తాజాగా మినహాయింపు లో అవకాశం ఇవ్వలేదు. ప్రజెంట్ చాలావరకు ప్రజలు మాస్క్ ధరించడం అదేవిధంగా బయటకు వచ్చాక ఇంటికి వెళ్లాక చేతులు శుభ్రపరుచుకోవడం వంటివాటికి బాగా అలవాటు పడ్డారు. ఇటువంటి టైం లో ప్రజా రవాణాకు కూడా పునరుద్ధరించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగానే ప్రజా రవాణా విషయంలో ప్రకటనలు చేయడం జరిగింది. లాక్ డౌన్ కారణంగా బస్సులు ప్రైవేటు క్యాబ్ లు అదేవిధంగా ఆటోలు  40 రోజులకు పైగా రోడ్ ఎక్కలేదు.

 

దీంతో మే 17వ తేదీ తర్వాత వచ్చే మినహాయింపు లో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థ ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు చేసే అవకాశం ఉన్నట్టు  వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వీటినన్నిటిని గమనిస్తున్న చాలామంది మోడీ కెరియర్ లోనే తాజాగా తీసుకున్న నిర్ణయాలు అతి మూర్ఖపు నిర్ణయాలు అని అంటున్నారు. ఒకపక్క కేసులు పెరుగుతున్న తరుణంలో మరో పక్క  రిలాక్సేషన్ చాలా ఎక్కువగా ఇచ్చేశారు. ఇలాంటి సమయంలో దేశవ్యాప్తంగా వైరస్ విస్తరించే అవకాశం ఉందని కేంద్రం కొద్దిగా ఓపిక పడితే ఏమవుతుంది అని ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: