ప్రేమ ఒక మధుర జ్ఞాపకం అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఎదిగి ఎదగని చిన్న వయసులోనే చిగురిస్తున్న ప్రేమలు... మధుర జ్ఞాపకాలను కాదు ఏకంగా ప్రాణాలను సైతం తీసేస్తున్నాయి . కొంతమంది ప్రేమ పేరుతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే... ఇంకొంతమంది ప్రేమ పేరుతో హత్యలు సైతం చేస్తున్నారు. రోజురోజుకు ఇలాంటి ఘటనలే ప్రేమ పేరుతో చాలా జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. లాక్ డౌన్ లో  ప్రియురాలిని చూడలేక నిరీక్షణ తట్టుకోలేక పోయిన ఓ యువకుడు ప్రియురాలిని చూసేందుకు ఇంటికి వెళ్ళాడు. కానీ చివరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆ యువకుడు. 

 

 

 చెన్నైలోని పొల్లాచ్చిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకున్ని  దారుణంగా హత్య చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూర్ జిల్లా పొల్లాచి సమీపంలో ఉన్న చిన్న పాలెం కు చెందిన రాధాకృష్ణన్  కుమారుడు గౌతం.. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో మానసికంగా కుంగిపోతూ వచ్చాడు.. ఈ క్రమంలోనే సూర్య స్వర పట్టి గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక తో ప్రేమలో పడ్డాడు గౌతమ్ , ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో తాను ప్రేమించిన బాలికను కలవకుండా చూడకుండా దూరంగానే ఉన్నాడు. 

 

 

 తన ప్రేయసిని కలిసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా శనివారం సమయంలో... ఇంట్లో ఎవరూ లేరని కలవడానికి రావాలి అంటూ ప్రియురాలు నుంచి గౌతమ్ కు సమాచారం అందింది. ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆ బాలికతో కలిశాడు. ఆ సమయంలో బాలిక తల్లి ఇంటికి వచ్చింది. అదే సమయంలో గదిలో ఎవరో మాట్లాడుకుంటూ ఉండటం గమనించిన  సదరు మహిళ తన భర్త కుమారుడు తన తమ్ముడికి సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకుని ముగ్గురు గౌతమ్ పై క్రికెట్ బ్యాట్ తో  దాడికి దిగారు. గౌతమ్ ను విచక్షణ రహితంగా క్రికెట్ బాట్ తో చితకబాదిన ఆ ముగ్గురూ చనిపోతాడనే  భయంతో పోలీసులకు అప్పగించారు. ఇంట్లోకి  చొరబడడం తోనే ఈ దాడి చేసినట్లు నాటకం ఆడారు. అనుకున్నట్లుగానే చికిత్సపొందుతూ గౌతం మరణించగా. అనుమానం వచ్చి ఆ ఇంట్లో ఉన్న బాలికను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది.  దీంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: