మొన్నటి వరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరిని ఒకరు తెగ పొగుడుకున్నారు. తేజ సమావేశాల్లోనే ఒకరి నిర్ణయాలని ఒకరు సమర్థించుకుంటూ రావటం జరిగింది. ఇటువంటి టైం లో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే‌సి‌ఆర్ - జగన్ ల మధ్య వివాదం నెలకొనడంతో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాల కు సంబంధించి కృష్ణా ప్రాజెక్టు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు కేసీఆర్. విభజన చట్టానికి విరుద్ధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు.

 

ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఈ ప్రాజెక్టు ను అడ్డుకోవడానికి న్యాయపోరాటం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం పై వెంటనే కృష్ణ వాటర్ మేనేజ్మెంట్ బోర్డులు ఫిర్యాదు చేయాలని ప్రభుత్వ అధికారులకు కెసిఆర్ ఆదేశించడం జరిగింది. వాస్తవంగా చూసుకుంటే తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్‌ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా చెబుతోందని, కానీ ఏపీ ప్రభుత్వం అపెక్స్‌ కమిటీ ఆమోదం తీసుకోలేదని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ప్రాజెక్ట్ వీటిలో నీటిని వాడుకోవాలంటే పొరుగు రాష్ట్రాన్ని తప్పకుండా సంప్రదించాలి...అవేమీ సంప్రదించకుండా ఏపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

అయితే ఉన్నట్టుండి కరోనా వైరస్ తో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక పొలిటికల్ గేమ్ ఉందని అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఎక్కువ బయట పడుతున్న తరుణంలో టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ప్రజల దృష్టి మరల్చడం కోసం కేసీఆర్‌ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి అంత పెద్ద గొడవ ఇది ఏమీ కాదని కేసీఆర్‌ కావాలని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్న కామెంట్లు వినబడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: