అవును కదా, ఆయన నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితం. అంతే కాదు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం. తెలుగుదేశం పార్టీ  వంటి దానికి పాతికేళ్ళుగా ఎదురులేని అధినేతగా ఉండడం అంటే బాబుకు బాబే సాటి కదా. ఆయనకు ఎవరూ పోటీ లేరు కూడా. అవును రాజకీయాలు చేయడంలో బాబుకు ఎవరూ పోటీ కానే కారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే చంద్రబాబు తాను చేయని పనులన్నీ జగన్ని చేయమనడమే వింతా, విడ్డూరమూనూ. బాబు హయాంలో ఏపీల మద్యం ఏరులై పారింది. ఆనాడు చంద్రబాబు ఆదాయాన్ని పెంచుకునేందుకు మధ్యాన్ని కూడా ఒక అతి పెద్ద వనరుగా మార్చుకున్నారు. ఏకంగా బెల్ట్ షాపులు ఎక్కడికక్కడ ప్రారంభించి మరీ మంచినీళ్ళ ప్యాకెట్ల కంటే దారుణంగా మద్యాన్ని అమ్మించారు. ఇంత చేసిన బాబు తాను బెల్ట్ షాపులు ఎత్తేస్తానని ముఖ్యమంత్రిగా తొలి అయిదు సంతకాల్లో ఒక దాన్ని పెట్టారు.

 

సరే బెల్ట్ షాపులు తగ్గించకపోగా వాటిని ఇబ్బడి ముబ్బడిగా పెంచిన ఘనత మాత్రం బాబుదే. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు తగుదునమ్మా అని జగన్ సర్కార్ మీద బాణాలు వేస్తున్నారు. ఏపీలో మద్యం ఏరులై పారుతోందిట. అంతే కాదు, ప్రజల రక్తాన్ని జగన్ సర్కార్ తాగుతోందిట.  మిగిలిన రష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం దుకాణాలు 33 శాతం  తగ్గాయి. అదే విధంగా ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బెల్ట్ షాపులను కూడా రద్దు చేశారు.

 

దశల వారీగా మద్యం షాపులను ఎత్తేస్తామని, 2024 నాటికి సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాన్ని జనం నమ్మారు. ఆయనకు పట్టం కట్టారు. మరి ఆ విషయం అలా ఉంటే ఇపుడు తగుదునమ్మా అని తెలుగు మహిళా నాయకురాళ్ళు సంపూర్ణ మద్య నిషేధం అంటూ నిరసనలు చేయడం అంటే బాబు తాను చేయనివి జగన్ చేయాలని  కోరుకుంటున్నారేమో. ఏది ఏమైనా మామ ఎన్టీయార్ బాబుని పూనేశారా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. సంపూర్ణ మద్య నిషేధం అన్నది అన్న గారి నినాదం. దానికి అక్షరాలా తూట్లు పొడిచింది బాబే.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: