ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో 55 రోజులుగా ఒంటరిగా బతుకీడుస్తున్న జర్మనీ నేరగాడికి విముక్తి దొరికింది.  మార్చి నెల నుంచి ఇంటర్ నేషనల్ పరిధిలో విమాన రాకపోకలు అన్నీ బంద్ చేశారు. ఇక లాక్ డౌన్ కారణంగా విమాన సర్వీసులన్నీ నిలిపివేయడంతో, న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒకే ఒక్క ప్రయాణికుడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఎట్టకేలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో 55 రోజులుగా ఒంటరిగా బతుకీడుస్తున్న జర్మనీ నేరగాడికి విముక్తి దొరికింది.   ఈ రోజు అతన్ని  కేఎల్ఎం విమానంలో ఆమ్‌స్టర్‌డామ్‌కు పంపేశారు. ఇతగాడు ప్రతి రోజు న్యూస్ పేపర్లు చదువుతూ.. ఇంట్లో వాళ్లతో ఫోన్ మాట్లాడుతూ.. కాలం గడిపేస్తున్నాడు. ఎన్నిరోజులు ఇలా టైమ్ పాస్ చేస్తావు నాయనా.. ఇక చాలు నీకు తిండి దండగ.. ఇక వెళ్లు నాయనా..  అని విమానం ఎక్కించేశారు.  

 

ఎడ్గార్డ్ జీబాట్ ( 40 ) వ్యక్తి మార్చి 18న హనోయి నుంచి ఇస్తాంబుల్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీలో విమానం ల్యాండ్ అయ్యింది. అక్కడి నుంచి తన గమ్యస్థానానికి వెళ్లాలి. కానీ కరోనా వైరస్ కారణంగా టర్కీ విమానాలను అన్నింటిని రద్దు చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో చిక్కుబడిపోయిన విదేశీ ప్రయాణికులకు ఆయా దేశాల రాయబార కార్యాలయాలు అన్ని సౌకర్యాలనూ కల్పించగా, జీబాట్ కు జర్మనీలో నేర చరిత్ర ఉండటంతో, ఆ దేశ ఎంబసీ కల్పించుకోలేదు.  

 

రిలీఫ్ విమానంలో కూడా అతని స్వదేశానికి పంపే అంశంపై జర్మనీ అధికారులు ఎవరూ స్పందించలేదు. దీంతో భారత ప్రభుత్వం కూడా వీసా ఇచ్చేందుకు నిరాకరించింది.   లాక్‌డౌన్ ముగిసే వరకు అతనికి ఈ కష్టాలు తప్పేలా లేవని అధికారులు అభిప్రాయపడ్డారు.. కానీ అతన్ని ఈ రోజు కేఎల్ఎం విమానంలో ఆమ్‌స్టర్‌డామ్‌కు పంపేశారు.  కరోనా పరీక్ష నిర్వహించి నెగిటివ్ రావడంతో వెంటనే ఈ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: