ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లో జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి లేడీస్ కి పెద్ద పీట వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ ఏడాది పరిపాలన చూస్తే ఎక్కువగా మహిళలకే పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బట్టి అర్థం అవుతోంది. అధికారంలోకి రావటం రావటమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులకు కన్నీటికి కారణమైన మద్యపాన నిషేధం పై ఉక్కుపాదం మోపి దశలవారీగా తగ్గించు కుంటూ జగన్ నిర్ణయాలు తీసుకోవటం మనకందరికీ తెలిసిందే. ఇదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ గాని ఏదైనా నగదు గాని ఇంటిలో ఉన్న ఆడపడుచు ఎకౌంట్ కి చేరే విధంగా జగన్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం అమలవుతున్న 'అమ్మ ఒడి' పథకం గాని ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో గాని విద్యార్థులకు చెందాల్సిన డబ్బులు డైరెక్టుగా తల్లి అకౌంట్లోకి పడే విధంగా చర్యలు చేపట్టడం ఇదే ప్రథమమని ప్రభుత్వ అధికారులు కూడా చెబుతున్నారు.

 

అంతే కాకుండా తన క్యాబినెట్ లో కూడా మహిళా డిప్యూటీ సీఎంగా ఒకరిని, మంత్రులుగా ఇద్దరిని అవకాశం కల్పిస్తూ లేడీస్ కి తన ప్రభుత్వంలో ఎంత ప్రాధాన్యం ఉందొ ఇండైరెక్ట్ గా తెలిపారు. అదేసమయంలో నామినేటెడ్ పదవుల్లో కూడా ఒకరికి అవకాశం ఇవ్వటం జరిగింది. ఒక పదవులు ఇవ్వటమే కాదు వాళ్లు చెప్పే నిర్ణయాలు కూడా జగన్ పరిగణలోకి తీసుకొని అమలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో ప్రభుత్వానికి మరియు సలహాదారులకు కూడా రాని ఒక ఐడియా దిశ పోలీస్ స్టేషన్ మరియు దిశ యాప్ ఈ ఐడియా ఇచ్చింది హోం శాఖ మంత్రి సుచరిత. ఆమె చెప్పడం ఆలస్యం జగన్ అమలులో చేసి చూపించారు.

 

అలాగే మధ్యాహ్నం పిల్లల భోజనం పథకం విషయంలో పిల్లలకు చిక్కీల‌ను ఇవ్వాల‌న్ని మంత్రి వ‌నిత ఆలోచ‌న‌ల‌ను కూడా జ‌గ‌న్ ఖ‌ర్చు అని కూడా చూడ‌కుండా అమ‌ల్లోకి తెచ్చారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ విషయంలో  ఏపీ చ‌రిత్ర‌లో తొలిసారి ఓ మ‌హిళా ఐఏఎస్ నీలం సాహ్నిని నియ‌మించ‌డంతోపాటు ఆమెకు కూడా పూర్తి స్వేచ్ఛ‌ను ఇవ్వ‌డం జ‌గ‌న్‌కే చెల్లింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంమీద చూసుకుంటే రాష్ట్రంలో ఉన్న మహిళలను సంతోషపరిచే విధంగా పరిపాలన ఉంటే చాలు మిగతాది సవ్యంగా జరుగుతుందని జగన్ బలంగా నమ్ముతున్నట్లు అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: