కరోనా వైరస్ రాకతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించటం అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి సమయములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు బిల్లు చూసి జనాలు నోరెళ్ళబెడుతున్నారు. ఇంటి అద్దెల కంటే కరెంటు బిల్లులు ఎక్కువ వచ్చినట్లు తెగ బాధ పడుతున్నారు. ఒకపక్క ఇంటి అద్దెలు చెల్లించిన అవసరం లేదని చెబుతూనే మరోపక్క కరెంటు బిల్లు రూపంలో భయంకరంగా ఛార్జీలు వేసి వినియోగదారుడి దగ్గర వసూలు చేయడంపై జనాలు ప్రభుత్వం పై మండిపడుతున్నారు. మరోపక్క కరోనా వైరస్ వల్ల ప్రజలకు నగదు రూపంలో డబ్బులు ఇచ్చి తరువాత వెంటనే మద్యం దుకాణాలు ఓపెన్ చేయటంతో చాలా వరకు మందు బాబులు డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. దీంతో ప్రభుత్వాలు ఈ చేత్తో అర్థరూపాయి ఇచ్చి, ఇంకో చేత్తో ఐదు రూపాయలు లాగేసుకోవడమెలాగో అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

 

మొత్తంమీద చూసుకుంటే ఒకపక్క జనాలని సవరదీస్తూ నే మరోపక్క ఏదో ఒక రూపంలో డబ్బులు రాబడుతుంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇటువంటి సమయంలో జనాలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ పై మండిపడుతున్నారు. రెండు నెలల నుండి ఉద్యోగాలకు వెళ్ళలేక చేతిలో చిల్లిగవ్వ లేక పడుతున్న ఇబ్బందులు తెలిసికూడా ఈ విధంగా కరెంటు బిల్లులు పెంచటం న్యాయం కాదని అంటున్నారు. ఎలక్ట్రిసిటీ బిల్లులు పెంచిన ప్రభుత్వాలు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి.

 

ప్రజలు అటువంటి షాక్ లు గత ప్రభుత్వాల కి ఇచ్చాయి. మరి జగన్ ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించుకోవాలని అని చాలామంది అంటున్నారు. ఎవరికీ జీతాలు లేక ఇంట్లో పిల్లలు పోషించుకునే పరిస్థితి లేక ఉన్న సమయంలో ఈ విధంగా కరెంటు బిల్లులు పెంచడం అనేది సరైన నిర్ణయం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ చార్జీలు కూడా పెంచినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ సమయంలో మంత్రి పేర్ని నాని ఆర్టీసీ చార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు. ఏదిఏమైనా కరెంటు బిల్లులు పెంచడం వెనక మతలబు చూస్తే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన డబ్బును అదే రీతిలో వసూలు చేయాలి అన్నట్లుగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: