గుజరాత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంటల్లో ఏకంగా 347 కేసులు నమోదు కావ‌డం గ‌మ‌నార్హం. దాదాపు  20 మంది ప్రాణాలు విడిచారు. వీరిలో 19 మంది ఒక్క అహ్మదాబాద్‌లోనే మరణించడం గమనార్హం. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 8,542కు చేరుకోగా, మరణాల సంఖ్య  513కు పెరిగింది. ఒక్క అహ్మదాబాద్‌లోనే 6,086 కేసులు ఉండ‌టం భ‌యాందోళ‌న క‌లిగిస్తోంది. అయితే ఈ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,780 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.


దేశ వ్యాప్తంగా స‌డ‌లింపు చ‌ర్య‌లు ఇచ్చిన నాటి నుంచి గుజ‌రాత్‌కు వేలాది మంది కార్మికులు చేరుకుంటున్నార‌ట‌. అంతేకాక దేశంలోని వివిధ ప్రాంతాల్లో వ్యాపార రీత్య సెటిలైన వారు కూడా అక్క‌డికి చేరుకుంటున్నారు. లాక్‌డౌన్ స‌క్ర‌మంగా అమ‌లు కావ‌డం లేద‌ని, రెడ్‌జోన్ల‌లో సైతం జ‌నం రోడ్ల‌పై తిరుగుతుండ‌టంతోనే కేసుల సంఖ్య పెరుగుతున్న‌ట్లు విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇక ప్ర‌ధాని సొంత రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండ‌టాన్ని కాంగ్రెస్ పార్టీ కేంద్రం వైఫ‌ల్యంగా ఎత్తిచూపుతోంది. ఇదిలా ఉండ‌గా మంగ‌ళ‌వారం రాత్రి ఎనిమిది గంట‌ల‌కు ప్ర‌ధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు.

 

లాక్‌డౌన్ పొడ‌గింపుపైనే ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని దేశ ప్ర‌జ‌లు అంచ‌నా వేస్తున్నారు. మూడో లాక్ డౌన్  పొడ‌గింపు గ‌డ‌వు ఈ నెల 17తో ముగియనుండగా, ఆ తరువాత కరోనా ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగిస్తూ, మిగతా ప్రాంతాల్లో మరిన్ని నిబంధనలను తొలగిం చేందుకే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. సోమ‌వారం 6 గంటల పాటు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించగా, అన్ని రాష్ట్రాల సీఎంలూ పాల్గొని త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ పొడ‌గించాల‌నే ఎక్కువ మంది సీఎంలు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.  అయితే నాలుగో దశ లాక్ డౌన్ లోనూ పొడ‌గింపుతో పాటు స‌డ‌లింపులు ఉంటాయ‌ని స‌మాచారం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: