రాజకీయాల్లోకి వచ్చాము అన్నది కాదు ఎలా రాణించారు అన్నది చాలా కీలకం. ఎందుకంటే అనేక రకాలుగా ప్రత్యర్థులు భయంకరమైన ఇబ్బందులకు గురి చేస్తారు. ప్రజల ముందు అనేక ఆరోపణలు చెయ్యని పనులకు అంటగడుతూ అనేక నిందలు ప్రత్యర్థులు వేస్తుంటాయి. వాటినన్నిటినీ తట్టుకుని నిలబడే వాడే  చివరాఖరికి విజయాన్ని అందుకుంటాడు. ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని చివరాఖరికి విజేతగా నిలిచాడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చేస్తూ మరో పక్క ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చే ఏడాది కావస్తున్నా క్రమంలో ఏ వర్గానికి ఆయన దూరం కాలేదు. అలాగని ఏ వర్గాన్ని మరీ అంత దగ్గరగా కూడా తీసుకోలేదు.

 

ఎన్నికల ప్రచారంలో అదేవిధంగా పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ మేనిఫెస్టో నెరవేరుస్తూ మాటమీద నిలబడే నాయకుడిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నారు. గత ప్రభుత్వాలలో ప్రజలు నాయకులు చుట్టూ తిరిగే విధానం లేకుండా డైరెక్టుగా తన ప్రభుత్వం యొక్క సంక్షేమం సామాన్యుడు ఒడిలో పడాలని గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావటం జరిగింది. ఈ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్కడ కూడా తనకి మరియు ప్రజలకి మధ్య నాయకులు లేకుండా చాలా సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నారు. అదేవిధంగా ప్రతి పేదవారికి ఉపయోగపడే విధమైన పథకాలు తీసుకొస్తున్నారు.

 

ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం అదే విధంగా ఆరోగ్యశ్రీ విషయంలో అనేక మార్పులు జగన్ తీసుకురావటం జరిగింది. పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో మంచి పౌష్టికాహారం పెట్టడం జరిగింది. వాళ్లకి యూనిఫామ్ మరియు పుస్తకాలు ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం నుండి అందేలా చర్యలు చేపడుతున్నారు. పింఛన్లు గాని పథకాలు గాని డైరెక్టుగా లబ్దిదారునికి చేకూరే విధంగా జగన్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొత్తంమీద చూసుకుంటే యేడాది పరిపాలనలో జగన్ సూపర్ సక్సెస్ సాధించాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: