వైయస్ జగన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాటి నుండి బాబోరు మీడియా టార్గెట్ చేస్తూనే ఉంది. జగన్ మీద అనేక అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలకు జగన్ పై  ఆయన నిర్ణయాలపై విసుగు కలిగించే విధంగా అధికారంలో వచ్చిన నాటి నుండి బాబోరు మీడియా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. జగన్ ఒక సైకో అని, తుగ్లక్ అని, మొండి వాడు అని, పెద్దలను గౌరవించడం చేతకాదు అని రకరకాలుగా బాబోరు మీడియా వార్తలు ప్రసారం చేయడం మనకందరికీ తెలిసిందే. అయితే ఇటువంటి సమయంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పై నాలుగు వందల కోట్ల నష్టం వాటిల్లిందని టిటిడి ఉద్యోగులకు దేవస్థానం జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అంటూ జగన్ సర్కార్ పై బాబోరు మీడియా కి సంబంధించిన పత్రికలు కథనాలు ప్రసారం చేశాయి. "ఆదాయం... గోవిందా?" అనే శీర్షిక‌తో రాసిన క‌థ‌నంలో నిజాలను వక్రీకరిస్తూ  ఆర్టికల్ రాయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

 

వాస్తవానికి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక పరిస్థితి అంత దయనీయంగా పెద్దగా ఏమీ లేదని 50 రోజులు ఆదాయాన్ని కోల్పోయిన అంతమాత్రాన పెద్ద నష్టమేమీ లేదని టీటీడీ సభ్యులు అంటున్నారు. అంతేకాకుండా తమ బోర్డు కి సంబంధించిన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా పెద్దగా లేదని అన్నారు. వస్తున్న వార్తలో నిజం లేదని అంటున్నారు.

 

మొత్తంమీద కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్‌ కాలంలో 150 కోట్లు మాత్రమే నష్టం వాటిల్లిందని ఇది పెద్ద కష్టమేమీ కాదని చెప్పుకొచ్చారు. ఈ విధంగా టీటీడీ బోర్డు పరువు పోయేలా అడ్డమైన రాతలు రాసిన బాబోరు మీడియాపై చర్యలు చేపట్టాలని దేవాదాయశాఖ కి జగన్ ఆదేశాలు పంపినట్లు సమాచారం. లేనిపోని వార్తలు రాస్తూ ఆఖరికి దేవుళ్ళ పై కూడా రాజకీయాన్ని చేస్తున్న మీడియా ని పూర్తిగా అరికట్టడానికి ఏపీ దేవాదాయ శాఖ సరైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: