తాను అధికారంలోకి వ‌స్తే.. అవినీతి అనే మాటేలేకుండా చేస్తాన‌ని చెప్పిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. అదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అధికారుల‌ను, త‌న పార్టీ ఎమ్మె ల్యేలు, ఎంపీల‌ను కూడా హెచ్చ‌రించారు. అవినీతి వ‌ల్లే గ‌త ప్ర‌భుత్వం దిగిపోవాల్సి వ‌చ్చింద‌నే విషయాన్ని కూడా జ‌గ‌న్ అంత‌ర్గ‌త స‌మావేశాల్లో నేత‌ల‌కు సూచించారు. ఇక‌, అధికారుల‌నైతే.. మ‌రింత సీరియ‌స్‌గా హెచ్చ‌రించారు.  ఎట్టి ప‌రిస్థితిలోనూ అవినీతిని స‌హించేది లేద‌న్నారు. ఈ క్ర‌మంలోనే ఒక‌టి రెండు డిపార్ట్‌మెంట్ల‌లో అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న అధికారుల‌ను త‌క్ష‌ణ‌మే బ‌దిలీ చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

 

ఇక‌, త‌న ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోనే అవినీతిపై ప్ర‌జ‌లు ఫిర్యాదు చేసేలా ఒక ఫోన్ నెంబ‌ర్‌ను ఏర్పా టు చేశారు. ఇలా జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో వ్యూహాత్మ‌కంగా అవినీతిపై పోరు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో కూ డా ప్ర‌భుత్వంపై ఓ న‌మ్మ‌కం ఏర్ప‌డుతున్న ప‌రిస్థితి ఉంది. అయితే, ఇంత‌లో అనూహ్యంగా ఓ యువ ఎంపీ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. అదికూడా దాదాపు రు. 100 కోట్ల విలువైన స్కాం కావ‌డంతో దీనిపై ప్రతిప క్షాలు క‌న్నెర్ర చేశాయి. ప్ర‌జ‌ల కోసం పంపిణీ చేయాల‌నే భూముల విష‌యం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం నుంచి గెలిచిన యువ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌.. ఈ అవినీతికి పాల్ప‌డ్డార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

 

కొద్ది రోజులుగా భ‌ర‌త్ తీరుపై సొంత పార్టీ నేత‌ల నుంచే అస‌మ్మ‌తి సెగ‌లు వినిపిస్తున్నాయి. త‌న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న ఎమ్మెల్యేలెవ్వ‌రితోనూ ప‌డ‌ట్లేద‌ని ప్ర‌ధాన మీడియాలో సైతం వార్త‌లు వ‌చ్చాయి. దీనికి తోడు స్థానికంగా త‌న లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ఓ ప్రాంతంలో ఇసుక వ్య‌వ‌హారాల్లోనూ ఆయ‌న వేలు పెట్టి రాబ‌డి పెంచుకుంటున్నార‌న్న టాక్ ఆయ‌న‌పై బ‌లంగా వ‌చ్చేసింది. దీంతో ఎంపీగారి విష‌యంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మవుతోంది. ఇక‌, ఈ విష‌యంపై స‌మాచారం అందుకున్న సీఎం జ‌గ‌న్ నేరుగా మార్గానిని త‌న ద‌గ్గ‌ర‌కు పిలిపించుకుని వార్నింగ్ ఇవ్వ‌డంతోపాటు.. స‌ద‌రు ఎంపీపై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన అన్ని ఆధారాల‌ను కూడా చూపించార‌ట‌. 

 

అప్ప‌టి వ‌ర‌కు బుకాయించే ప్ర‌య‌త్నం చేసిన మార్గాని.. సైలెంట్ అయిపోయార‌న్న వార్త‌లు వైసీపీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. దీంతో ఇక‌పై ఎలాంటి ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. పొలిటిక‌ల్‌గా ఫ్యూచ‌ర్ లేకుండా చేస్తాన‌ని జ‌గ‌న్ హెచ్చ‌రించి తీవ్రంగా మంద‌లించి పంపార‌ని పార్టీలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఈ ఎంపీ దెబ్బ‌తో పార్టీలో అవినీతి అంటేనే హ‌డ‌లెత్తే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: