ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.రాష్ట్రంలో ఒకటి రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కరోనా అదుపులోకి వచ్చినట్టేనని చెప్పవచ్చు. ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వల్లే రాష్ట్రంలో కరోనా నియంత్రణ సాధ్యమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో అధిక సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించి కరోనాను కట్టడి చేయడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. 
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,730 శాంపిల్స్ ను పరీక్షించగా 33 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈరోజు నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2051కు చేరింది. రాష్ట్రంలో నిన్నటివరకు 1056 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 949 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో ఒకరు మృతి చెందడంతో కరోనా మృతుల సంఖ్య 46కు చేరింది. ఈరోజు నమోదైన కేసుల్లో తమిళనాడు కోయంబేడు నుంచి ఏపీకి వచ్చిన 20 మందిలో కరోనా నిర్ధారణ అయింది. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకూ రికార్డు స్థాయిలో 1,91,874 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒక మిలియన్ జనాభాకు 3,593 పరీక్షలతో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల రేటు 1.07 శాతంగా ఉంది. రాష్ట్రంలో కరోనా బాధితుల రికార్డు స్థాయిలో 51.49 శాతంగా నమోదైంది. ఏపీలో కరోనా మరణాల రేటు 2.24 శాతంగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. 
 
రాష్ట్రంలో గత 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, అనంతపూర్, గుంటూర్, కడప, ప్రకాశం, వైజాగ్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు. కర్నూలు జిల్లాలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజుల క్రితం కర్నూలులో 30కు పైగా కేసులు నమోదు కాగా ప్రస్తుతం సింగిల్ డిజిట్ లో కేసులు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: