లాక్‌డౌన్ కారణంగా ఆయా దేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుల‌ను స్వ‌దేశానికి త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన‌ వందే భారత్ మిషన్ రెండో దశ ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏకంగా 149 విమానాలన వినియో గిస్తున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తీయులు 31 దేశాల్లో చిక్కుకుపోయిన‌ట్లుగా గుర్తించారు. ఈ నెల 16 నుంచి 22వ తేదీల మధ్య విమానాలు ఆయా దేశాల‌కు బ‌యల్దేరి వెళతాయి. అక్క‌డ ఉన్న‌ మన పౌరులను వెనక్కి తీసుకురాన్నాయి. మలేషియా, ఇండోనేషియా, ఫిలప్పీన్స్, సింగపూర్,ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్, కజక్‌స్తాన్, ఉక్రెయిన్,  థాయ్‌లాండ్, రష్యా,  కిర్గిజిస్తాన్, జార్జియా, తజికిస్తాన్, బెలారస్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, బహ్రెయిన్, అర్మేనియా, నేపాల్, నైజీరియా దేశాలకు మన విమానాలు వెళ్లనున్నాయి.

 

అయితే వందే భారత్ 2.0 మిషన్‌లో భాగంగా  ఇండియా నుంచి యూఏఈకి 11, సౌదీ అరేబియాకు తొమ్మిది,అమెరికాకు 13 విమానాలు, యూకేకు తొమ్మిది, కెనడాకు 10,  రష్యాకు ఆరు, ఆస్ట్రేలియాకు ఏడు విమానాలను భార‌త్ పంప‌నుంది. ఇక పొరుగున ఉన్న నేపాల్‌,  బంగ్లాదేశ్‌కు ఒక్కో విమానం చొప్పున పంపించబోతున్నట్టు కేంద్రం తెలిపింది. వందే భారత్ 1.0లో భాగంగా  64 విమానాల ద్వారా 12 దేశాల నుంచి  రెండు లక్షల మంది భార‌తీయుల‌ను ఇండియాకు చేర్చే కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. ఈ కార్య‌క్ర‌మం ఈనెల మ‌ధ్య‌స్తం వ‌ర‌కు ముగుస్తుంద‌ని స‌మాచారం. 


లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు చేపట్టిన వందే భారత్1.0 మిషన్‌లో భాగంగా ఇప్పటి వరకు 6,037 మందిని వెనక్కి తీసుకొచ్చిన‌ట్లుగా అధికారిక లెక్క‌ల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచంలోనే మరే దేశమూ చేపట్టనంతగా అతిపెద్ద తరలింపు చేపట్టిన భారత్ విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఎయిర్ ఇండియా విమానాల ద్వారా స్వదేశం తీసుకొస్తోంది.  ఇక  వందే భారత్ 2.0లో భాగంగా జూన్ మధ్యలో కల్లా.. దాదాపు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది భారతీయులను మన దేశానికి తీసుకురాబోతున్నట్టు  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: