దేశంలో మొదలైన కరోనా వైరస్ ఎప్పుడు ఎలా ఉంటుందో.. దాని ప్రభావం ఎలా చూపిస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు.  దీని లక్షణాలు అంత త్వరగా బయట పడకపోవడం పెద్ద మైనస్ గా మారుతుంది.  భారత్‌లో కొవిడ్‌-19 వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు 3,000 కంటే అధికంగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 87 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మరణాలు సంఖ్య కూడా రోజూ పెరిగిపోతున్నాయి.. ప్రస్తుతం మృతుల సంఖ్య మొత్తం 2,293కి చేరింది.  ఇప్పటి వరకు కరోనా నుంచి 22,454 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 46,008 మంది చికిత్స పొందుతున్నారు. 

 


ఇక దేశంలోకరోనా ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు లో ప్రబలిపోతుంది. గుజరాత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో ఏకంగా 347 కేసులు నమోదు కాగా, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 8,542కు చేరుకోగా, మరణాల సంఖ్య  513కు పెరిగింది. కేరళలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం కొత్తగా ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు.  


ఆ మద్య వరుసగా రెండు రోజులు ఇక్కడ జీరో కేసులు  ఉన్న విషయం తెలిసిందే. అయితే ఉన్నట్టుండి మళ్లీ ఇక్కడ కరోనా కేసులు మొదలు కావడం కలవరపెడుతున్నాయి. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో నలుగురు విదేశాల నుంచి రాగా..ఒక్కరు చెన్నై నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చారని చెప్పారు.  ప్రస్తుతం కేరళలో 32 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ ఒక్కరు కూడా డిశ్చార్జ్‌ కాలేదు. మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 524 మందికి వైరస్‌ సోకింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: